Samyuktha Menon | ఇంటిపేరు తీసేశా..!
‘భీమ్లానాయక్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మలయాళీ భామ సంయుక్త మీనన్. ప్రస్తుతం ఆమె ధనుష్ సరసన ‘సార్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
‘భీమ్లానాయక్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మలయాళీ భామ సంయుక్త మీనన్. ప్రస్తుతం ఆమె ధనుష్ సరసన ‘సార్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తన మనసులోని భావాల్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేసే ఈ సొగసరి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ఇక నుంచి తనను అందరూ సంయుక్త అనే పేరుతో పిలవాలని సూచించింది.
మీనన్ అనే తన ఇంటిపేరును తీసివేశానని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘స్కూల్లో చేరినప్పుడు నమోదు చేసిన పేరు అలాగే కొనసాగుతూ వచ్చింది. కొంత పరిణితి వచ్చిన తర్వాత పేరు చివరన తోకలు ఉండాల్సిన అవసరం లేదనిపించింది. అదీగాక నా తల్లిదండ్రులు ఎప్పుడో విడాకులు తీసుకున్నారు. నాన్న ఇంటి పేరుతో నన్ను పిలవడం అమ్మకు ఇష్టం లేదు. ఆమె కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నా. ఇక నుంచి సినిమాలతో పాటు నా సోషల్మీడియా ఖాతాల్లో కూడా సంయుక్త అనే పేరు మాత్రమే ఉంటుంది’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

