Cinema News | తెలుగులో వందశాతం సక్సెస్ రేట్ ఉన్న కథానాయిక సంయుక్త మీనన్. ఇక్కడ ఆమె చేసిన బీమ్లానాయక్, బింబిసార, సర్, విరూపాక్ష అన్నీ విజయాలే. త్వరలో ‘డెవిల్’ రాబోతున్నది. ఈ సినిమా కూడా సెంటిమెంట్‌ని కొనసాగించడం ఖాయమని చిత్రయూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తున్నది. ఇదిలావుంటే తన పాత్రల గురించి, సక్సెస్‌ల గురించి సంయుక్త ఇటీవల మాట్లాడింది. ‘ పద్నాలుగు సినిమాలు మలయాళంలో చేశాను. తెలుగు, తమిళ భాషల్లో చెరో నాలుగు చేశాను.
నా కెరీర్లో గొప్ప విజయాలన్నీ తెలుగులోనే వచ్చాయి. అందుకే తెలుగు నాకు లక్కీయస్ట్ ఇండస్ట్రీ. పైగా చేసిన నాలుగు సినిమాల్లోనూ విభిన్న పాత్రలే. ‘బ్లీమ్లానాయక్’లో సాధారణ గృహిణిగా నటించాను. ‘బింబిసార’లో యువరాణిగా ఫోక్లర్ కేరక్టర్ చేశాను. ‘సర్’లో సామాజికదృక్పథం కలిగిన ఉపాధ్యాయురాలిని. ‘విరూపాక్ష’లో మీకు తెలిసిందే.. అన్నీ పొంతన లేని పాత్రలే. రానున్న ‘డెవిల్’ పీరియాడికల్ ఫిల్మ్. అందులో పాత్ర గురించి ఇప్పుడే రివీల్ చేయదలచుకోలేదు. భిన్నమైన పాత్ర అని మాత్రం చెప్పగలను. తెలుగులో చేసిన సినిమాలన్నీ హిట్స్ అవ్వడం. అన్నీ పొంతన లేని పాత్రలవ్వడం నా అదృష్టం’ అంటూ చెప్పుకొచ్చింది సంయుక్త.