వణికిస్తున్న కరోనా.. హీరోయిన్‌తో పాటు పిల్లలకు పాజిటివ్

కరోనా మహమ్మారి ప్రకంపనలు పుట్టిస్తుంది. సెలబ్రిటీలను సైతం కరోనా గజ గజ వణికిస్తుంది. రీసెంట్గా బాలీవుడ్ నటి సమీరా రెడ్డి కరోనా బారిన పడింది. ఆదివారం రోజు తాను కరోనా బారిన పడినట్టు తెలియజేసిన సమీరా ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నాను. నా ముఖం మీద చిరునవ్వు తీసుకొచ్చే ఎందరో నా చుట్టూ ఉన్నారు. ఈ సమయంలో పాజిటివ్‌గా దృడంగా ఉండాలని పేర్కొంది. అయితే సోమవారం ఉదయం నెటిజన్స్ సమీరా పిల్లల గురించి ఆరాలు తీయగా, హన్స్, నైరాలకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని చెప్పుకొచ్చింది.
గత వారం హన్స్ కు అధిక జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పితో కాస్త అలసటగా ఉన్నాడు. నాలుగు రోజులు ఇలానే ఉండంతో కరోనా పరీక్షలు చేయించాము. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మొదట్లో నాకు చాలా భయం వేసింది. ఇక కూతురు నైరా గురించి మాట్లాడుతూ.. నైరాలో లక్షణాలు వెంటనే కనిపించడం ప్రారంభించాయి. పారాసెట్మాల్, కోల్డ్‌కు సంబంధించిన టాబ్లెట్స్ ఇచ్చాను. క్షేమంగానే ఉంది. సెకండ్ వేవ్ చాలా ఉదృతంగా ఉంది. పిల్లలలో తేలికపాటి లక్షణాలు కనిపిస్తున్నాయి. వైద్యులు మల్టీ విటమిన్స్, విటమిన్ సి సిఫారస్ చేస్తున్నారు. సెకండ్ వేవ్‌ను నిర్లక్ష్యం చేయకుండా కరోనా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సమీరాతో పాటు ఆమె పిల్లలు కరోనా బారిన పడడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని ట్వీట్స్ చేస్తున్నారు. 2012లో రానా దగ్గుబాటి హీరోగా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాలో కనిపించి అలరించిన సమీరా.. 2014లో వ్యాపార వేత్త అక్షయ్ వార్డేను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

