Samantha | అఫీషియల్.. సల్మాన్ ఖాన్‌తో సమంత రొమాన్స్
Samantha | ఇటీవలే ఖుషి సినిమాతో సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది సమంత (Samantha). తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ (Vishnuvardhan) బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) తో సినిమా చేస్తున్నాడని తెలిసిందే.
Samantha | ఇటీవలే ఖుషి సినిమాతో సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది సమంత (Samantha). శివనిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు సమంతకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ (Vishnuvardhan) బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)తో సినిమా చేస్తున్నాడని తెలిసిందే.
ఈ మూవీని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై ముందుగా వచ్చిన వార్తలే నిజమయ్యాయి. మేకర్స్ ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ కోసం సమంతను ఫైనల్ చేశారని తాజా సమాచారం. నవంబర్ లేదా డిసెంబర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. తొలిసారి సల్మాన్‌ఖాన్, సమంత కాంబోలో సినిమా వస్తుందని తెలియడంతో ఎక్జయిటింగ్‌కు లోనవుతున్నారు మూవీ లవర్స్.
సమంత ఇటీవలే బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధవన్‌తో కలిసి నటిస్తున్న సిటడెల్ వెబ్ సిరీస్‌ను పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం టైగర్ ప్రాంఛైజీలో వస్తున్న టైగర్ 3 (Tiger 3)తో బిజీగా ఉన్నాడు. మనీశ్ శర్మ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్ హీరోయిన్గా నటిస్తోంది. షారుఖ్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
దేశభక్తి ప్రధాన ఇతివృత్తంతో రాబోతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల చేసేందుకు యశ్ రాజ్ ఫిలిం ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రాన్ని నవంబర్ 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీలో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తుండగా.. అశుతోష్ రాణా, అనుప్రియా గోయెంకా, రిద్ధి డోగ్రా, అంగద్ బేడి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Exclusive : #SalmanKhan And #Samantha will share screen space for the first time in a #Vishnuvardhan directorial. #KaranJohar @DharmaMovies #Tiger3 pic.twitter.com/EMgiPExSum
— Vishwajit Patil (@_VishwajitPatil) September 19, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

