తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, వెబ్ ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది సమంత (Samantha). ఈ భామ గ్లామరస్ రోల్స్ తోపాటు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ లో మెప్పిస్తూ..తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. కొన్నాళ్ల క్రితం సామ్ స్టార్ హీరో విజయ్ (Vijay) సినిమాలో నెగెటివ్ పాత్రలో కనిపించబోతుందంటూ వార్తలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
యాక్షన్ డ్రామాగా లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) డైరెక్షన్లో రాబోతున్న ఈ చిత్రంలో సామ్ పోలీసాఫీసర్ పాత్ర (Samantha)లో నటించనుందట. సామ్ ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ ప్రాజెక్టులో నెగెటివ్ రోల్లో కనిపించగా..మంచి ప్రశంసలు అందుకుంది. మరి తాజా అప్ డేట్ ప్రకారం సమంత నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీసాఫీసర్ పాత్రలో ఎలా కనిపించబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటిస్తోన్న శాకుంతలం షూటింగ్ పూర్తి చేసుకుంది. మరోవైపు హరి-హరీష్ డైరెక్షన్లో ఫీ మేల్ సెంట్రిక్ సబ్జెక్టు యశోదలో నటిస్తోంది. దీంతోపాటు శివనిర్వాణ-విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న ఖుషీలో హీరోయిన్గా నటిస్తోంది సమంత.