Shakuntalam | 14 కోట్ల ఆభరణాలు
సమంత టైటిల్ రోల్‌ని పోషిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకుడు. మహాకవి కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది.
సమంత టైటిల్ రోల్‌ని పోషిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకుడు. మహాకవి కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాకు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా కాస్ట్యూమ్స్ సమకూర్చారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఆభరణాల డిజైన్‌కు ఎనిమిది నెలల సమయం పట్టింది. ఈ సినిమా కోసం 14కోట్ల విలువైన నిజమైన బంగారం, వజ్రాలను ఉపయోగించాం. ఇలా చేయడం ఇండియాలోనే తొలిసారి’ అని చెప్పింది. కొత్త పోస్టర్లో సమంత రాజవంశపు రాణి, కావ్య నాయకి శకుంతల దేవిగా అచ్చెరువొందే అందచందాలతో అందరిని ఆకట్టుకుంటున్నది. వజ్ర వైడూర్యాలు పొదిగిన బంగారు ఆభరణాల్ని ధరించి ప్రబంధ నాయికలా సమంత మెరిసిపోతున్నది. పౌరాణిక కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్‌మోహన్ దుష్యంతుడి పాత్రను పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

