మల్లికా మల్లికా మాలతీ మాలికా
సమంత ప్రధాన పాత్రలో నటించిన పౌరాణిక నేపథ్య సినిమా ‘శాకుంతలం’. ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్కృత నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు గుణశేఖర్ రూపొందించారు.
సమంత ప్రధాన పాత్రలో నటించిన పౌరాణిక నేపథ్య సినిమా ‘శాకుంతలం’. ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్కృత నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు గుణశేఖర్ రూపొందించారు. ఇందులో దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 14న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి మల్లికా మల్లికా మాలతీ మాలికా అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటను మణిశర్మ స్వరపర్చగా చైతన్య ప్రసాద్ సాహిత్యాన్ని అందించారు. రమ్య బెహరా పాడారు. ఈ పాట విడుదల సందర్భంగా దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ…‘ఇది తనకు ఇష్టమైన పాట అని సమంత చెబుతుంటుంది. ఈ పాట ఆడియో ఎంతగా ఆకట్టుకుంటుందో విజువల్‌గా తెరపై అంతే ఆనందాన్ని కలిగిస్తుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

