ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కథానాయికల్లో సమంత ఒకరు. తన వర్కవుట్ తాలూకు వీడియోలను తరచుగా సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. సినిమా షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నా వ్యాయామాన్ని మాత్రం అస్సలు మిస్ చేయనని చెబుతుంటుంది సమంత. తాజాగా ఈ అమ్మడు హైదరాబాద్ శివారు ప్రాంతంలో జోరు వానలో సైక్లింగ్ చేస్తూ ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. ‘నా బెస్ట్ ఫ్రెండ్స్‌తో కలిసి వర్షంలో సైకిల్ రైడ్ చేయడం ఓ మధురానుభూతి. ఈ రోజు 21 కిలోమీటర్లు సైకిల్ తొక్కాను. భవిష్యత్తులో వంద కిలోమీటర్లు వెళ్లేందుకు ప్రయత్నిస్తా’ అని సమంత పేర్కొంది. ఈ వీడియోకు ‘అన్బ్రేకబుల్’ అనే క్యాప్షన్‌ను జత చేసింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఫిట్‌నెస్‌లో భాగంగా సైకిల్‌రైడ్ చేయడం గొప్ప విషయమని ఆమె అభిమానులు ప్రశంసిస్తున్నారు. సమంత ఇటీవలే ‘శాకుంతలం’ చిత్రీకరణ పూర్తిచేసుకుంది. గుణశేఖర్ దర్శకత్వంలో మహాభారతంలోని పౌరాణికగాథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.