Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అత్యంత ఆనందకరమైన వార్తను అధికారికంగా ప్రకటించి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రెగ్నెన్సీ వార్తలకు స్వయంగా స్పందించిన సమంత.. తాను త్వరలో తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా సినిమాల నుంచి తాత్కాలికంగా మెటర్నిటీ బ్రేక్ తీసుకుంటున్నట్లు కూడా ప్రకటించింది. ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన నేపథ్యంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమంత చేసిన ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. స్టేజ్‌పై మాట్లాడిన సమంత తన జీవితంలోని కష్టసుఖాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురైంది. ఆరోగ్య సమస్యలు, కెరీర్లో ఎదురైన ఒడిదుడుకుల సమయంలో అభిమానులు తనకు అండగా నిలిచారని చెప్పింది.
మాతృత్వం ప్రతి మహిళ జీవితంలో ఒక అందమైన అధ్యాయం. నా జీవితంలో ప్రారంభమవుతున్న ఈ కొత్త ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదించాలనుకుంటున్నాను. అందుకే కొంతకాలం సినిమాలకు విరామం ఇస్తున్నాను. ఇది తాత్కాలికమే. త్వరలోనే మరిన్ని మంచి ప్రాజెక్టులతో తిరిగి వస్తాను అని సమంత తెలిపింది. గత కొన్ని రోజులుగా ‘మా ఇంటి బంగారం’ ప్రమోషన్స్, సక్సెస్ ఈవెంట్లలో సమంత కొంత భిన్నంగా కనిపించడం, సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని ఫోటోలు, వీడియోల కారణంగా ప్రెగ్నెన్సీపై పుకార్లు మొదలయ్యాయి. అయితే వాటిపై స్పందించకుండా వచ్చిన సమంత ఇప్పుడు స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సమంత మరియు ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు మధ్య పరిచయం వెబ్ సిరీస్‌ల ద్వారా ఏర్పడింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ వంటి ప్రాజెక్టుల సమయంలో వీరి మధ్య స్నేహం ప్రేమగా మారిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.గత ఏడాది డిసెంబర్లో కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో వీరిద్దరూ సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు పెళ్లి అయిన కొద్ది నెలలకే తమ జీవితంలోకి కొత్త సభ్యుడిని ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సినీ వర్గాల సమాచారం ప్రకారం సమంత ప్రస్తుతం తొలి త్రైమాసికంలో ఉందని, ఈ ఏడాది చివర్లో డెలివరీ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.