Samajavaragamana | యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద సామజవరగమన హవా.. ఆ మార్క్ చేరుకుంటుందా..?
Samajavaragamana | టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన తాజా చిత్రం సామజవరగమన (Samajavaragamana). కాగా ఈ చిత్రం యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతూ.. శ్రీవిష్ణు టీంలో ఫుల్ జోష్ నింపుతోంది.
Samajavaragamana | కంటెంట్‌ను నమ్ముకొని సినిమా చేసే హీరోల్లో ముందు వరుసలో ఉంటాడు టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu). ఈ టాలెంటెడ్ యాక్టర్ నటించిన తాజా చిత్రం సామజవరగమన (Samajavaragamana). వివాహ భోజనంబు ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ జూన్ 29న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ప్రీమియర్ షోల నుంచి ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన వస్తోంది. కాగా ఈ చిత్రం యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతూ.. శ్రీవిష్ణు టీంలో ఫుల్ జోష్ నింపుతోంది.
తాజాగా కలెక్షన్లకు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద 787వేల డాలర్లు (రూ.6.5 కోట్లు) వసూలు చేసిందని ట్రేడ్ సర్కిల్ సమాచారం. రెండో శనివారం సామజవరగమన ఊహించని విధంగా రూ.82,61,550 (ఒక లక్ష డాలర్లు) కలెక్షన్లు రాబట్టిందంటే సినిమాను ప్రేక్షకులను ఎంతలా ఇంప్రెస్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. తాజా కలెక్షన్ల అప్డేట్ నేపథ్యంలో ఈ చిత్రం యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద మిలియన్ డాలర్ మార్క్ చేరుకుంటుందా..? అనేది చూడాలంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇప్పటికే శ్రీవిష్ణు సినిమాను ఆదరిస్తూ సక్సెస్ఫుల్ టాక్ అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు కూడా తెలియజేశాడని తెలిసిందే. సామజవరగమన గ్లింప్స్ వీడియో, టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసి, మార్కెట్‌ను పెంచడంలో కీ రోల్ పోషించాయనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు మూవీ లవర్స్.
ఫన్, ఫ్యామిలీ, యాక్షన్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ చిత్రంలో బిగిల్ (విజిల్) ఫేం రెబా మోనికా జాన్ (Reba Monica John) ఫీ మేల్ లీడ్ రోల్ పోషించింది. సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిశోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవీ ప్రసాద్, ప్రియ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేశ్ దండా నిర్మించారు.
#Samajavaragamana #USA🇺🇸Gross:
👉Premieres : $27,004
👉Day 1 : $46,077
👉Day 2 : $71,227
👉Day 3 : $112,220
👉Day 4 : $106,690
👉Day 5 : $83,686
👉Day 6 : $98,408
👉Day 7 : $42,587
👉Day 8 : $34,789
👉Day 9 : 64,285
👉Day 10 : $100,050Total Gross : $787,023 [₹6.50 Crs]… pic.twitter.com/fqTlLBRz1M
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) July 9, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

