శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. రాజేష్ దండా నిర్మాత. రెబా మోనికా జాన్ నిర్మాత. ఈ ఏడాది వేసవిలో విడుదల కానుంది. శ్రీవిష్ణు జన్మదినం సందర్భంగా ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుదల చేశారు. తన ప్రేయసిని వివాహం చేసుకోవాలనుకున్న శ్రీవిష్ణుకు ఒక సమస్య ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో సాగిన ఫస్ట్‌గ్లింప్స్ ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగింది. ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, గోపీసుందర్ మ్యూజిక్ ప్రధానాకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం పేర్కొంది. మోనికా జాన్, నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: భాను భోగవరపు, సంభాషణలు: నందు సవిరిగాన, సంగీతం: గోపీసుందర్, సినిమాటోగ్రఫీ: రాంరెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజు.