The Family Man | ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మేకర్స్‌తో సల్మాన్ ఖాన్ సూపర్ హీరో ప్రాజెక్ట్!
The Family Man | బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ త్వరలో ఒక విభిన్నమైన యాక్షన్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తుంది.
The Family Man | బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ త్వరలో ఒక విభిన్నమైన యాక్షన్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ వంటి బ్లాక్‌బస్టర్ వెబ్ సిరీస్‌ల సృష్టికర్తలు రాజ్ & డీకే దర్శకత్వంలో సల్మాన్ ఒక భారీ బడ్జెట్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 2026 అక్టోబర్‌లో ప్రారంభం కానున్నట్లు టాక్ నడుస్తుంది. ఈ చిత్రం ఒక హై-కాన్సెప్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది. సల్మాన్ ఖాన్‌ను మునుపెన్నడూ చూడని రీతిలో ఒక శక్తివంతమైన సూపర్ హీరో పాత్రలో చూపించబోతున్నారు. హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ నటించిన ‘హ్యాంకాక్’ తరహాలో, సూపర్ హీరో ఎలిమెంట్స్‌కు కాస్త కామెడీని జోడించి ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విజువల్ ఎఫెక్ట్స్ (VFX)పై దర్శకులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ భారీ చిత్రాన్ని అతుల్ అగ్నిహోత్రి నిర్మిస్తుండగా, టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల ఈ సినిమా పాన్-ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుంటోంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్, టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి మరియు ప్రముఖ నిర్మాత దిల్ రాజు కాంబినేషన్లో రాబోతున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే, రాజ్ & డీకే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

