Tiger 3 | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) టైగర్ ప్రాంఛైజీ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదే లైన్లో మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించేందుకు రెడీ అవుతోంది టైగర్ 3 (Tiger 3). మనీశ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కత్రినాకైఫ్ హీరోయిన్గా నటిస్తోంది. టైగర్ 3 దీపావళి కానుకగా నవంబర్ 12 థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషనల్ ఈవెంట్స్‌తో బిజీగా ఉంది సల్లూభాయ్ టీం.
కాగా రిలీజ్‌కు ముందే ట్రెండ్ క్రియేట్ చేస్తుంది టైగర్ 3. ఈ చిత్రం యశ్‌రాజ్ ఫిలిం యూనివర్స్‌లో అరుదైన రికార్డు సృష్టించిందన్న వార్త ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం 12 ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలతో టైగర్ 3 రికార్డు క్రియేట్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. అంతేకాదు టైగర్ 3లో 10 నిమిషాలపాటు సల్మాన్ ఖాన్ ఇంట్రడక్షన్ సీక్వెన్స్ ఉండబోతుందట. ఈ రెండు అప్డేట్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి.
టైగర్ 3 హిందీ, తమిళం, తెలుగు భాషల్లో గ్రాండ్‌గా విడుదలవుతుంది. ఈ చిత్రంలో అశుతోష్ రాణా, అనుప్రియా గోయెంకా, రిద్ధి డోగ్రా, అంగద్ బేడి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టైగర్ ప్రాంఛైజీలో ఏక్తా టైగర్, టైగర్ జిందా హై తర్వాత వస్తున్న సినిమా కావడంతో టైగర్ 3పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఐమాక్స్ ఫార్మాట్లో కూడా విడుదల కానుంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్యా చోప్రా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందిస్తుండగా.. శ్రీధర్ రాఘవన్ స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నాడు.
టవల్ సీన్ మేకింగ్ స్టిల్స్..
#KatrinaKaif Towel fight Scene gonna Blow Your Mind … 💥 💥 #Tiger3
Hottest Action Scenes Ever. 🥵🔥
Katrina towel fight hottest scene will turn theaters into stadium 🤤🥵🔥#SalmanKhan #Tiger3Diwali2023#EmraanHashmi #Katrina #Tiger3FirstDayFirstShow #FDFS pic.twitter.com/UfwFSA4ife
— 𝑺𝒖𝒎𝒊𝒕 𝑺𝒊𝒏𝒈𝒉 𝑹𝒂𝒋𝒑𝒖𝒕 (@BeingSumit007) November 6, 2023
Get ready to book your 1st day 1st show tickets of #Tiger3 from 7 AM in India 🔥🔥🔥
Advance Bookings open on Sunday, 5th Nov across India 🔥
Tiger 3 is the next chapter of the interconnected #YRFSpyUniverse which unleashes in cinemas worldwide on Sun 12 Nov, 2023 [#Diwali2023]… pic.twitter.com/yKmyNe7BSc— Yash Raj Films (@yrf) November 1, 2023
#Tiger3 is coming to roar on 11th Nov, 9 PM IST onwards in Middle East, North America, UK & Europe and Africa! #YRF50 | #YRFSpyUniverse pic.twitter.com/q3XnG6NDQg
— Yash Raj Films (@yrf) November 1, 2023
టైగర్ 3 ట్రైలర్..