బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ (Kisi ka Bhai Kisi Ki Jaan). రిపబ్లిక్ డే సందర్భంగా ఒకరోజు ముందే (జనవరి 25న) ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ కూడా విడుదల చేశారు.
ముందుగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. ఫర్హాద్ సమ్జీ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. టాలీవుడ్ హీరో వెంకటేశ్ కీ రోల్ పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో జగపతి బాబు, భాగ్యశ్రీ, భూమికా చావ్లా, మాళవికా శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాంచరణ్ అతిథి పాత్రలో మెరవబోతున్నాడు.
కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రాన్ని ముంబై, హైదరాబాద్, లడఖ్ లొకేషన్లలో షూట్ చేశారు. హోంబ్యానర్ సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ బ్యానర్లో సల్మాన్ ఖాన్ తెరకెక్కిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 21న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
కిసీ కా భాయ్ కిసీ కా జాన్ టీజర్