Salman Khan | సినీ పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లకు సూపర్ క్రేజ్ ఉంటుంది. బాలీవుడ్లో అలాంటి క్రేజీ జోడీల్లో టాప్‌లో ఉంటుంది కబీర్‌ఖాన్ (Kabir Khan)-సల్మాన్ ఖాన్ (Salman Khan). ఈ ఇద్దరి కాంపౌండ్ నుంచి వచ్చిన ఏక్తా టైగర్, బజరంగీ భాయ్‌జాన్ సినిమాలు బాక్సాఫీస్‌ను ఏ స్థాయిలో షేక్ చేశాయో తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఈ హిట్ ద్వయం బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది.
ట్యూబ్‌లైట్ సినిమా తర్వాత సల్లూభాయ్-కబీర్ ఖాన్ నాలుగో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారని ఇన్సైడ్ టాక్. తాజా సమాచారం ప్రకారం పాపులర్ ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిలింస్ ఈ సినిమాను నిర్మించబోతుంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. హ్యూమన్ ఎమోషన్స్‌తో సాగే స్టోరీ టెల్లింగ్‌తో తాజా కథనంతో అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించేలా కబీర్ ఖాన్ కొత్త సినిమా ఉండబోతుందని అప్పుడే తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
మరి దీనిపై సల్లూభాయ్ టీం నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. ఒకవేళ ఇదే నిజమైత ఈ సారి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో సికిందర్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. కబీర్ ఖాన్ ఇప్పటికే The Diplomat సినిమాను లైన్లో పెట్టగా.. దీనికి సంబంధించిన కొత్త అప్డేట్ రావాల్సి ఉంది.
Fahadh Faasil | వెడ్డింగ్‌లో పుష్ప యాక్టర్ ఫహద్ ఫాసిల్.. ఇంతకీ ఎవరిదో తెలుసా..?
The Girlfriend | రష్మిక మందన్నా ది గర్ల్‌ఫ్రెండ్‌కు స్టార్ హీరో వాయిస్ ఓవర్..!
Ram Gopal Varma | సినిమా టికెట్ ధరల మీదే ఏడుపెందుకు.. రాంగోపాల్ వర్మ పుష్ప 2 ఇడ్లీల కథ చదివారా..?