మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ లూసిఫర్‌ను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మోహన్ రాజా డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం గాడ్ ఫాదర్ (Godfather)టైటిల్‌తో తెరకెక్కుతుంది.తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అటు బీటౌన్, ఇటు టాలీవుడ్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న గాడ్‌ఫాదర్ లో బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) కీలక పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటివరకున్న టాక్.
తాజా అప్డేట్ ప్రకారం లూసిఫర్ షూటింగ్ ముంబైలో వేసిన సెట్స్ లో కొనసాగుతుండగా..సల్లూభాయ్ షూటింగ్లో జాయిన్ అయ్యాడట. ఒరిజినల్ వెర్షన్ లో పృథ్విరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రలో సల్లూభాయ్ కనిపించనున్నాడని తెలుస్తోండగా..దీనిపై అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది. ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలుపోషిస్తున్నారు.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలపై రానున్న రోజుల్లో స్పష్టత రానుంది.