రియాద్ : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) క్రిస్టియానా రొనాల్డోతో కలిసి రియాద్‌లో బాక్సింగ్ మ్యాచ్ వీక్షించారు. టైసన్ ఫ్యురీ, ఫ్రాన్సిస్ నాగన్‌నౌ మధ్య జరిగిన బాక్సింగ్ మ్యాచ్‌కు సల్లూ భాయ్ హాజరయ్యాడు. స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానా రొనాల్డో, ఆయన భాగస్వామి జార్జియానా రోడ్రెగ్జ్తో కలిసి సల్మాన్ ఖాన్ ఈ మ్యాచ్‌ను ఎంజాయ్ చేశాడు.
సాకర్ లెజెండ్ క్రిస్టియానా రొనాల్డోతో పాటు సల్మాన్ ఖాన్ కనిపించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. సౌదీ అరేబియాలో ఓ బాక్సింగ్ మ్యాచ్‌కు టైగర్ 3 హీరో హాజరైన ఈ క్లిప్ ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. సల్మాన్, రొనాల్డోను ఒకే ప్రేమ్‌లో చూపుతూ వీడియోలు, ఫొటోలు నెట్టింట సందడి చేస్తుండటంతో సల్మాన్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.
Attitude of Salman Khan >>pic.twitter.com/buXkNoWO8C
— ` (@Salman_Rules) October 29, 2023
వీవీఐపీ సీట్లలో జార్జియానా రోడ్రెగ్జ్, క్రిస్టియానో రొనాల్డో సరసన సల్మాన్ ఖాన్ కనిపించారు. ఈ వీడియోతో ఖుషీ అయిన బాలీవుడ్ స్టార్ అభిమానులు ఫుట్‌బాలర్, సల్మాన్ ఖాన్‌లపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.
Read More :