Gold Rates | పైపైకి బంగారం ధరలు.. దీపావళి కల్లా రూ.63 వేలు దాటుతుందా..?! కారణాలివేనా..!
Gold Rates | దేశంలోని ప్రధాన మెట్రో పాలిటన్ నగరాల్లో చెన్నైలో 24 క్యారట్ల బంగారం పది గ్రాములు ధర రూ.700 వృద్ధితో రూ.62,950 లకు చేరుకున్నది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారట్ల బంగారం పది గ్రాములు రూ.650 పెరిగి రూ.57,700 వద్ద ముగిసింది. కిలో వెండి ధర రూ.77,500 వద్ద నిలిచింది.
Gold Rates | బంగారం అంటే లక్ష్మీదేవితో సమానం. అందుకే భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. ప్రత్యేకించి మహిళలు బంగారం ఆభరణాలంటే ప్రాణం పెడతారు. పెండ్లిండ్లు, పండుగలు, కుటుంబ వేడుకలకు బంగారం కొనుగోలు చేయాల్సిందే. ప్రత్యేకించి అక్షయ తృతీయ, దంతేరాస్, దీపావళి సందర్భంగా తమ వెసులుబాటును బట్టి బంగారం కొనుగోలు చేస్తుంటారు. కానీ భారతీయుల అవసరాలకు సరిపడా బంగారం కావాలంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. దీనివల్ల వివిధ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నా, డాలర్ విలువలో ఒడిదొడుకులు నెలకొన్నా, ముడి చమురు ధర పెరిగినా బంగారానికి డిమాండ్ లభిస్తుంది. ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో అనిశ్చిత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లకు ఆల్టర్నేటివ్ పెట్టుబడి మార్గంగా బంగారం ఆప్షన్‌గా ఉంటుంది.
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి గిరాకీ ఎక్కువైంది. దీనికి తోడు దేశంలో పండుగల సీజన్‌తోపాటు పెండ్లిండ్లు జరుగనుండటంతో బంగారం ధర క్రమంగా పెరుగుతున్నది. దేశంలోని ప్రధాన మెట్రో పాలిటన్ నగరాల్లో చెన్నైలో 24 క్యారట్ల బంగారం పది గ్రాములు ధర రూ.700 వృద్ధితో రూ.62,950 లకు చేరుకున్నది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారట్ల బంగారం పది గ్రాములు రూ.650 పెరిగి రూ.57,700 వద్ద ముగిసింది. కిలో వెండి ధర రూ.77,500 వద్ద నిలిచింది.
పరిస్థితులు ఇలాగే కొనసాగితే దంతేరాస్, దీపావళి పండుగలకల్లా తులం బంగారం రూ.63,000 దాటుతుందని బులియన్ వ్యాపారులు చెబుతున్నారు. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం 2006.18 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. శనివారంతో పోలిస్తే 21.36 డాలర్లు పెరిగింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.660 పెరిగి రూ.62,770 వద్ద స్థిర పడింది. ఆభరణాల తయారీకి వాడే బంగారం తులం (22 క్యారట్స్) ధర రూ.600 పెరిగి రూ.57,500 వద్ద నిలవగా, కిలో వెండి ధర రూ.74,600 వద్ద ముగిసింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్, మహారాష్ట్ర రాజధాని ముంబై, ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్ణాటక రాజధాని బెంగళూరు, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలలో తులం బంగారం రూ.660 వృద్ధితో రూ.62,620 వద్ద ట్రేడ్ కాగా, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.600 పెరుగుదలతో రూ.57,400 వద్ద నిలిచింది. బెంగళూరు మినహా అన్ని నగరాల్లో కిలో వెండి ధర రూ.74,600 వద్ద ముగిసింది. బెంగళూర్‌లో కిలో వెండి ధర రూ.750 తగ్గి రూ.73 వేల వద్ద స్థిర పడింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

