Salaar Movie | గూస్ బంప్స్ తెప్పించేలా ‘సలార్’ మాస్ యాక్షన్ ప్రోమో
Salaar Movie | టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas), మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘సలార్’ (Salaar). శ్రుతిహాసన్ కథానాయికగా నటించింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకురాగా.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా.. రూ.1000 కోట్ల దిశగా దూసుకెళుతుంది.
Salaar Movie | టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas), మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘సలార్’ (Salaar). శ్రుతిహాసన్ కథానాయికగా నటించింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకురాగా.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా.. రూ.1000 కోట్ల దిశగా దూసుకెళుతుంది.
తాజాగా ఈ చిత్రం నుంచి మాస్ యాక్షన్ ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. ”దేవుళ్ళు ఎలాగో రారు అన్నావుగా అందుకే ఇటు తిరిగి మొక్కుతున్న అంటూ”.. ప్రభాస్‌ను ఎలివేట్ చేసేలా ఉన్న ఈ ప్రోమో గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అది ఖాన్సార్ అరాచక సామ్రాజ్యం. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ ప్రాంతం స్వయం ప్రతిపత్తితో కొనసాగుతుంటుంది. ప్రత్యేక రాజ్యాంగం తయారు చేసుకొని, రాజ్యానికి నాలుగు వైపుల బలమైన గోడలు నిర్మించి అక్కడి రాజు రాజమన్నార్ (జగపతిబాబు) సామ్రాజ్య పాలన చేస్తుంటాడు. రాజ మన్నార్ తన కొడుకు వరద రాజమన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్)ని దొరగా చేయాలని నిరయిస్తాడు. రాజ్యానికి సంబంధించిన ఓ ముఖ్యమైన పనిపై కొన్నాళ్లు బయటికివెళ్తాడు రాజ మన్నార్. ఈలోగా సింహాసనం కోసం అంతర్యుద్దం మొదలౌతుంది. మిగతా దొరలంతా కలసి వరదని అంతం చేయడానికి సైన్యాలని రప్పించుకుంటారు. వరద తన సైన్యంగా చిన్ననాటి స్నేహితుడు దేవా (ప్రభాస్)ని పిలుస్తాడు. అసలు ఈ దేవ ఎవరు ? వరద, దేవాల మధ్య వున్న అనుబంధం ఏమిటి ? అంత సైన్యాన్ని దేవా ఒక్కడే ఎలా ఎదురుకున్నాడు? ఈ కథలో ఆద్య (శ్రుతిహాసన్) పాత్ర ఏమిటి ? సింహాసనం కోసం జరిగిన ఈ యుద్ధంలో ఎలాంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి ? అనేది తెరపై చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

