Saiyaara Movie | స్టార్ నటులు లేకుండా వారం రోజుల్లో రూ.150 కోట్లు.. బాలీవుడ్లో ‘సైయారా’ సంచలనం
Saiyaara | బాలీవుడ్లో చిన్న సినిమాగా విడుదలై రికార్డులు సృష్టిస్తుంది సైయారా (Saiyaara) చిత్రం.
Saiyaara Movie | బాలీవుడ్లో చిన్న సినిమాగా విడుదలై రికార్డులు సృష్టిస్తుంది సైయారా (Saiyaara) చిత్రం. ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ చిత్రం వారం రోజుల్లోనే ఏకంగా రూ.150 కోట్ల భారీ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సంచలనం క్రియేట్ చేస్తుంది. సాధారణంగా భారీ బడ్జెట్‌తో, పెద్ద స్టార్లతో తెరకెక్కే చిత్రాలు మాత్రమే ఈ స్థాయిలో వసూళ్లను సాధిస్తుంటాయి. అయితే, ‘సైయారా’ చిత్రం కంటెంట్ బలంగా ఉంటే చిన్న చిత్రాలు కూడా పెద్ద విజయాలను నమోదు చేయగలవని మరోసారి నిరూపించింది.
ఆషికి 2, ఎక్ విలన్, ఆవరాపన్, వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్న దర్శకుడు మోహిత్ సూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. ఈ చిత్రంతో ఆహాన్ పాండే, అనిత్ పడ్డా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. లవ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం ఎటువంటి మౌత్‌టాక్ లేకుండా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. తొలిరోజే రూ.21 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు రూ.24 కోట్లు, మూడో రోజు రూ.35 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం విడుదలైన ఆరు రోజులకే రూ.150 కోట్ల వసూళ్లను సాధించినట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో చాలా రోజుల తర్వాత బాలీవుడ్‌కి మంచి హిట్ వచ్చిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ‘సైయారా’ టీమ్ ఈ అనూహ్య విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

