కనిపెడితే పదివేలు
‘ఈ సినిమాలో నాది లాయర్ పాత్ర. అందుకే అందరం లాయర్ గెటప్‌లో వచ్చాం. సినిమాలో నా పేరు సిద్ధార్థ నీలకంఠ. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ క్రిమినల్ లాయర్ని. అసలు నేను క్రిమినల్ లాయర్‌నా? లేక క్రిమినలా? ఒక నేరంతో లాయర్‌కు ఏమైనా సంబంధం ఉందా? అనే ఆసక్తికరమైన అంశాలతో థ్రిల్‌ని పంచుతుంది’ అన్నారు సాయిరామ్ శంకర్.
‘ఈ సినిమాలో నాది లాయర్ పాత్ర. అందుకే అందరం లాయర్ గెటప్‌లో వచ్చాం. సినిమాలో నా పేరు సిద్ధార్థ నీలకంఠ. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ క్రిమినల్ లాయర్ని. అసలు నేను క్రిమినల్ లాయర్‌నా? లేక క్రిమినలా? ఒక నేరంతో లాయర్‌కు ఏమైనా సంబంధం ఉందా? అనే ఆసక్తికరమైన అంశాలతో థ్రిల్‌ని పంచుతుంది’ అన్నారు సాయిరామ్ శంకర్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. వినోద్ కుమార్ విజయన్ దర్శకుడు. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సాయిరామ్‌శంకర్ మాట్లాడుతూ..
ఈ సినిమాకు ‘పట్టుకుంటే పదివేలు’ పేరుతో ఓ కాంటెస్ట్ పెడుతున్నామని, ఇంటర్వెల్ లోపు విలన్ ఎవరో కనిపెడితే థియేటర్లోనే పదివేలు అందిస్తామని, యాభై కేంద్రాల్లో ఈ కాంటెస్ట్ నిర్వహించబోతున్నామని తెలిపారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశమిదని, సాయిరామ్‌శంకర్ చాలా కొత్తగా కనిపిస్తాడని దర్శకుడు పేర్కొన్నారు. కథాపరంగా, సాంకేతికంగా ఈ సినిమా గొప్పగా ఉంటుందని నిర్మాత గార్లపాటి రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. శృతిసోధి, అశిమ నర్వాల్, సముద్రఖని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాహుల్‌రాజ్, నిర్మాతలు: వినోద్ కుమార్ విజయన్, గార్లపాటి రమేష్, కథ, మాటలు, దర్శకత్వం: వినోద్ కుమార్ విజయన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

