SaiPallavi | సాయిపల్లవి ఇంట్లో పెండ్లి వేడుకలు మొదలయ్యాయి. సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్ త్వరలోనే పెండ్లి పీటలు ఎక్కబోతుంది. ఇప్పటికే పెద్దలను ఒప్పించి.. తన ప్రియుడు వినీత్‌తో మూడు ముళ్లు వేయించుకునేందుకు సిద్ధమయ్యింది. ఈ క్రమంలోనే ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా పూజా కన్నన్ తెలియజేసింది. ఎంగేజ్మెంట్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయని చెబుతూ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. రెండు చేతులకు మెహందీ పెట్టుకుని పూజా కన్నన్ చాలా సంతోషంగా కనిపించింది. తన అక్క సాయిపల్లవితో కూడా ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను పూజా కన్నన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
చాలా ఏండ్లుగా ప్రేమలో ఉన్న పూజా కన్నన్.. ఇటీవల పొంగల్ సమయంలో తన బాయ్‌ఫ్రెండ్ వినీత్‌ను ఇన్స్టాగ్రామ్ వేదికగా పరిచయం చేసింది. తమ పెండ్లికి పెద్దలు ఒప్పుకున్నారని.. త్వరలోనే తమ పెండ్లి జరగనున్నట్లు అందులో హింట్ కూడా ఇచ్చింది. ‘ ఈ అందమైన లిటిల్ బటన్ నిస్వార్థంగా ఎలా ప్రేమించాలో నేర్పించాడు. ప్రేమలో ఓలా ఓపికగా ఉండాలో అతనే నేర్పించాడు. అతనే వినీత్. నిన్నటివరకు నా క్రైమ్ పార్టనర్.. ఇప్పుడు నా పార్టనర్. ఐ లవ్యూ’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.