ఎవరికోసం ఈ విరహ వేదన
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నిఖిల్. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది ఇండియా హౌస్'. సాయి మంజ్రేకర్ కథానాయిక.
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నిఖిల్. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది ఇండియా హౌస్’. సాయి మంజ్రేకర్ కథానాయిక. రామ్వంశీకృష్ణ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అగ్ర హీరో రామ్‌చరణ్, విక్రమ్‌రెడ్డి.వి భాగస్తులుగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది.
మంగళవారం సాయి మంజ్రేకర్ పుట్టిన రోజు సందర్భంగా, ఇందులో ఆమె పోషిస్తున్న ‘సతి’ పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. సంప్రదాయ చీరకట్టులో ప్రియుడి గురించి ఆలోచిస్తూ విరహ వేదన అనుభవిస్తున్నట్టుగా ఈ లుక్‌లో సాయి మంజ్రేకర్ కనిపిస్తున్నది.
1905లో జరిగే పీరియడ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతున్నదని, ప్రేమ, విప్లవం నేపథ్యం ఈ సినిమా కథ ఉంటుందని మేకర్స్ తెలిపారు. అనుపమ్‌ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సహనిర్మాత: మయాంక్ సింఘానియా, సమర్పణ: రామ్‌చరణ్, నిర్మాణం: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

