Saidharam Tej | తనను కాపాడిన అబ్దుల్‌కు సాయిధరమ్ తేజ్ ఎలాంటి సహాయం చేశాడు?
Saidharam Tej | సినీ పరిశ్రమలో నా కెరీర్ ప్రారంభంలో నాకు సపోర్ట్ చేసిన నా గురువు మామయ్య పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది నన్ను నేను నిరూపించుకునే అవకాశం అనిపించింది. కథ కూడా వినకుండానే సినిమా చేయడానికి అంగీకరించాను’ అన్నారు కథానాయకుడు సాయి ధరమ్ తేజ్.
Saidharam Tej | సినీ పరిశ్రమలో నా కెరీర్ ప్రారంభంలో నాకు సపోర్ట్ చేసిన నా గురువు మామయ్య పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది నన్ను నేను నిరూపించుకునే అవకాశం అనిపించింది. కథ కూడా వినకుండానే సినిమా చేయడానికి అంగీకరించాను’ అన్నారు కథానాయకుడు సాయి ధరమ్ తేజ్. ఆయన పవన్‌కళ్యాణ్‌తో కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. సముద్ర ఖని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో విలేకర్లతో ముచ్చటించారు.పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
పవన్‌కల్యాణ్‌తో నటించడం ఎలా అనిపించింది?
మొదటిరోజు కంగారు పడ్డాను. వణికిపోయాను. మావయ్య పిలిచి ఎందుకురా కంగారు పడుతున్నావు. నేనే కదా అంటూ నా టెన్షన్ అంతా తీసి పక్కనపెట్టారు. దాంతో వెంటనే సెట్ అయిపోయాను.
ఈ కథతో పర్సనల్‌గా ఏమైనా కనెక్ట్ అయ్యారా?
కథ ఓకే చేసిన సమయానికి నాకు యాక్సిడెంట్ జరగలేదు. అది యాదృచ్చికంగా జరిగింది. టైం విషయంలో మాత్రం కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను కుటుంబంతో సమయం గడపటాన్ని ఇష్టపడతాను.
షూటింగ్ ప్రారంభమైన మొదట్లో మీరు కాస్త ఇబ్బంది పడ్డారని ప్రీ రిలీజ్ వేడుకలో పవన్‌కళ్యాణ్ చెప్పారు కదా?
యాక్సిడెంట్ తరువాత అప్పటికి నేను ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అప్పుడు మాట ఇంత గట్టిగా వచ్చేది కాదు. దాంతో డైలాగ్‌లు చెప్పేటప్పుడు ఇబ్బందిపడ్డాను. ఆ సమయంలో నాకు మాట విలువ తెలిసింది. డబ్బింగ్ విషయంలో బాగా కష్టపడ్డాను. తరువాత సెట్ అయ్యింది.
పవన్‌కళ్యాణ్ రాజకీయాల్లో వుంటూనే సినిమాలు చేస్తున్నారు? ఆ ప్రభావం సెట్లో ఏమైనా కనిపించిందా?
రాజకీయంగా ఎన్ని ఒత్తిడులు ఉన్నా, ఎన్ని పనులున్నా ఒక్కసారి సెట్లోకి వచ్చారంటే సినిమాలోని ఆ పాత్రను ఎలా చేయాలనే ఆలోచిస్తారు. బయట విషయాన్ని మర్చిపోయి ప్రస్తుతం చేస్తున్న సన్నివేశానికి ఏం అవసరమో అది చేయగలగడం అనేది ఆయన నుంచి నేర్చుకున్నాను.
సినిమా ఎలా వుంటుంది?
ఈ సినిమాలో సందేశం వుంటుంది. ఈ క్షణంలో బ్రతకటం గురించి చెబుతుంది. మన కష్టం మనం పడితే అందుకు తగిన ప్రతిఫలం దక్కుతుందని చెబుతుంది. అదే సమయంలో కామెడీ, రొమాన్స్ ఇలా మిగతా అంశాలన్నీ కావాల్సిన మోతాదులో వుంటాయి.
కొద్దిరోజులు విరామం తీసుకుంటున్నారని తెలిసింది?
ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలని చిన్న విరామం తీసుకోవాలి అనుకుంటున్నాను. విరూపాక్ష తర్వాతే తీసుకోవాలి అనుకున్నాను. కానీ ఇంతలో ‘బ్రో’ షూటింగ్ ప్రారంభమైంది. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుని మరింత దృడంగా వస్తాను. ఇప్పటికే సంపత్ నంది గారి దర్శకత్వంలో ఒక సినిమా అంగీకరించాను.
మిమ్మల్ని యాక్సిడెంట్ సమయంలో కాపాడిన అబ్ధుల్కి ఏమైనా సాయం చేశారా?
కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. నేను అతనికి కొన్ని డబ్బులిచ్చి చేతులు దులుపుకోవాలి అనుకోలేదు. ఎందుకంటే అతను నా ప్రాణాన్ని కాపాడాడు. నేను అతనికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా వుంటానని చెప్పాను. ఈ మధ్య కూడా అతన్ని కలిశాను. నా టీమ్ అతనికి ఎప్పుడూ అందుబాటులోనే వుంటుంది.
చిరంజీవితో కలిసి ఎప్పుడు నటిస్తారు?
ముగ్గురు మామయ్యలతో కలిసి నటించాలని నాకు ఎప్పటి నుంచో ఆశ. నాగబాబు మామయ్య, కళ్యాణ్ మామయ్యతో చేశాను. ఇక చిరంజీవి మామయ్యతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

