Sai Pallavi | ఎక్కడున్నా.. గౌరవంగా ఉండాలి.. గౌరవంగానే వెళ్లిపోవాలంటున్న నేచురల్ బ్యూటీ
సాయిపల్లవి అందం ఏమోగానీ.. ఆమె చుట్టూ ఉండే ఆరా కళ్లు తిప్పుకోనివ్వదు. మనసుల్ని కట్టిపడేసే తెలీని ఆకర్షణ ఆమె సొంతం.
Sai Pallavi | సాయిపల్లవి అందం ఏమోగానీ.. ఆమె చుట్టూ ఉండే ఆరా కళ్లు తిప్పుకోనివ్వదు. మనసుల్ని కట్టిపడేసే తెలీని ఆకర్షణ ఆమె సొంతం. నిజానికి సాయిపల్లవికి ఉన్నంత క్రేజ్ దక్షిణాదిన ఏ హీరోయిన్‌కీ లేదు. తన ప్లేస్‌లో వేరెవరైనా ఉంటే.. దీపం ఉంది కదా అని ఇల్లు చక్కబెట్టుకునే పనిలో బిజీగా ఉండేవాళ్లు. కానీ సాయిపల్లవి అలా కాదు. కథ నచ్చాలి. పాత్ర అభినయానికి ఆస్కారమున్నది కావాలి. అప్పుడే చేయటానికి ఓకే చెబుతుంది. అందుకే హీరోయినై తొమ్మిదేళ్లవుతున్నా తక్కువ సినిమాల్లోనే నటించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఆసక్తికరంగా మాట్లాడింది సాయిపల్లవి.
‘ ఎంబీబీఎస్ ఇష్టంతోనే చదివాను. యాక్టర్‌ని కూడా ఇష్టంతోనే అయ్యాను. డాన్స్ కూడా ఇష్టంతోనే నేర్చుకున్నాను. ఇష్టంలేకుండా నా జీవితంలో ఏదీ జరగలేదు. ఇక ఈ క్రేజ్ అంటారా.. అది గాడ్ గిఫ్ట్. ‘ప్రేమమ్’ వచ్చేదాకా నటించగలనని నాకే తెలీదు. ఇంట్లోవాళ్లు కూడా షాక్. ‘జీవితం ఎటు తీసుకెళ్తే అటు వెళ్లడమే మన పని’ అని డాడీ చెప్పారు. ‘కాకపోతే ఎక్కడున్నా.. ఎలా ఉన్నా.. గౌరవంగా ఉండాలి. గౌరవంగానే బతకాలి.. గౌరవంగానే వెళ్లిపోవాలి..’ ‘ప్రేమమ్’కి సైన్ చేస్తున్నప్పుడు నాన్న నాకు చెప్పిన నీతి. ఆ మాటలు జీవితంలో మరిచిపోను.’ అంటూ అందంగా నవ్వుతూ చెప్పుకొచ్చింది సాయిపల్లవి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shigella infections | కేరళలో షిగెల్లా ఇన్ఫెక్షన్లు వ్యాప్తి.. 75 కేసులు నమోదు
AP Group-2 | 720 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్.. డిసెంబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవాలి
Sonia Gandhi | సీరియల్ కిల్లర్ శోభరాజ్ గర్ల్‌ఫ్రెండ్‌కు ఇంటి నుంచి భోజనం తీసుకెళ్లా : సోనియాగాంధీ
RS Praveenkumar | ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్ల పొట్ట కొట్టాలని చూస్తున్న గ్రీన్ SM కంపెనీ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ACB raids | ఇరిగేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇంటిపై ఏసీబీ దాడులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

