saranga dariya | సాయి పల్లవి మరో రికార్డు.. 300 మిలియన్ క్లబ్బులో సారంగ దరియా సాంగ్
saranga dariyal song |యూ ట్యూబ్ను మకుటంలేని మహారాణిగా ఏలేస్తుంది సాయి పల్లవి. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సాయి పల్లవి పాటలు మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. యూట్యూబ్ రికార్డులు తిరగ రాస్తున్నాయి.

saranga dariyal song |యూ ట్యూబ్ను మకుటంలేని మహారాణిగా ఏలేస్తుంది సాయి పల్లవి. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సాయి పల్లవి పాటలు మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. యూట్యూబ్ రికార్డులు తిరగ రాస్తున్నాయి. ఇప్పటికే సాయి పల్లవి చిందేసిన రౌడీ బేబీ 1.2 బిలియన్ వ్యూస్ అందుకుంది. ఫిదా, ఎంసీఏ సినిమాలోని పాటలు కూడా సంచలనం సృష్టించాయి. ఈ కోవలోనే ఇప్పుడు లవ్ స్టోరీ సినిమాలోని సారంగ దరియా పాట గత ఐదు నెలలుగా యూట్యూబ్లో రికార్డులు తిరగరాస్తోంది. ప్రేక్షకులు కూడా ఈ జానపద గేయానికి జై కొడుతున్నారు. తాజాగా ఈ పాట 300 మిలియన్ క్లబ్ లో చేరింది.
సాయి పల్లవి మూడోసారి 300 మిలియన్ మార్క్ అందుకుంది. ఇదివరకే ఫిదా సినిమాలోని వచ్చిండే పాట 300 మిలియన్ మార్క్ అందుకుని చరిత్ర సృష్టించింది. తాజాగా సారంగదరియా కూడా 300 మిలియన్ మార్క్ దాటడంతో సాయిపల్లవి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తెలంగాణ జానపద గేయం నుంచి మూలాలు తీసుకొని దానికి సినిమా టచ్ ఇచ్చాడు సుద్దాల అశోక్ తేజ. ఈ పాట విషయంలో అప్పట్లో వివాదం కూడా రేగింది. అయితే ఎలాంటి తప్పులు జరగకుండా ఆ సమస్యను సామరస్యంగా పరిష్కరించారు.
అప్పట్లో స్టార్ మా లో వచ్చిన రేలారే రేలా ప్రోగ్రాం సమయంలో సుద్దాల అశోక్ తేజ తన పాట విన్నాడని.. ఇప్పుడు లవ్ స్టోరీలో ఈ పాటను వాడుకున్నారని తెలియగానే అశోక్ తేజకు ఫోన్ చేశానని చెప్పింది కోమలి. ఇది ఎవరి సొంతం కాదు.. నువ్వు పుట్టక ముందే ఈ పాట నా దగ్గరుంది అని చెప్పాడని చెప్పుకొచ్చింది ఈమె. ఏదేమైనా ఎన్నో వివాదాలు దాటుకుని ఈ పాట సంచలనం సృష్టించింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ.. సాయి పల్లవి డాన్స్ పాటకు ప్రధాన బలం. దానికితోడు పవన్ మ్యూజిక్ కూడా చాలా బాగా హెల్ప్ అయ్యింది. అన్నింటికీ మించి అద్భుతమైన విజువల్స్ ఈ పాటను మరో స్థాయిలో ఉంచాయి. చూస్తుండగానే 50, 100, 200, 300 అంటూ మిలియన్ మార్క్ దాటుకుంటూ వెళ్లిపోతుంది సారంగ దరియా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

