సాయిపల్లవి చేసిన సినిమాలేమో గానీ వదులుకున్న సినిమాలు మాత్రం చాలానే ఉంటాయి. పెద్దపెద్ద సినిమాలను సైతం రిజక్ట్ చేశారామె. ఆ సినిమాల వరుసలో ఇప్పడు ‘చంద్రముఖి 2’ కూడా చేరిందని తెలిసింది. నిజానికి ఈ సినిమా అనుకున్నప్పుడు దర్శకుడు పి.వాసు తొలుత సంప్రదించింది సాయిపల్లవినేనంట.
చంద్రముఖి నర్తకి కావడంచేత, సాయిపల్లవి లాంటి గొప్ప నర్తకి ఆ పాత్ర చేస్తే సినిమాకు హెల్ప్ అవుతుందని వాసు భావించారట. పైగా సాయిపల్లవి కళ్లతోనే అభినయించగల గొప్ప నటి. అందుకే పి.వాసు ఆమె కోసం ప్రయత్నించారు. కానీ ఆమె కథ విని సున్నితంగా తిరస్కరించిందట. దాంతో చివరకు కంగనారనౌత్ ‘చంద్రముఖి 2’కి ఖరారైంది. గింజమీద తినేవారి పేర్లు రాసినట్టు.. పాత్ర మీద కూడా చేసే ఆర్టిస్ట్ పేరు రాస్తాడనుకుంట ఆ దేవుడు.