కిల్‌బిల్ లాంటి యాక్షన్ సినిమా చేస్తా
ఇటీవలే ‘విరాటపర్వం’ చిత్రంలో వెన్నెల పాత్రలో ఆకట్టుకున్న సాయి పల్లవి...నటనకు ఆస్కారమున్న మరో చిత్రంతో ప్రేక్షకులకు ముందుకొస్తున్నది. ఆమె టీచర్ పాత్రలో నటిస్తున్న సినిమా ‘గార్గి’.
ఇటీవలే ‘విరాటపర్వం’ చిత్రంలో వెన్నెల పాత్రలో ఆకట్టుకున్న సాయి పల్లవి…నటనకు ఆస్కారమున్న మరో చిత్రంతో ప్రేక్షకులకు ముందుకొస్తున్నది. ఆమె టీచర్ పాత్రలో నటిస్తున్న సినిమా ‘గార్గి’. ఈ చిత్రానికి గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ నెల 15న ఈ చిత్రాన్ని తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్, తమిళంలో సూర్య 2డీ ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేస్తున్నాయి. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపింది సాయి పల్లవి.
వైవిధ్యమైన సినిమాలు చేసే మీకు ‘గార్గి’లో నచ్చిన అంశాలేమిటి?
నేను ఏ కథ విన్నా అందులో నటించేందుకు కొత్తగా ఏముందని ఆలోచిస్తా. నా క్యారెక్టర్ విభిన్నంగా ఉండాలని కోరుకుంటా. ఈ స్క్రిప్ట్ వింటున్నప్పుడు మన జీవితాలకు దగ్గరగా ఉన్న కథ అనిపించింది. మనం రేపు సినిమా ద్వారా ప్రేక్షకులకు ఏం చెప్పబోతున్నామో అర్థమైంది. తెలుగులో ‘వకీల్ సాబ్’, తమిళంలో ‘జై భీమ్’ లాంటి ప్రయత్నమిది. కొన్నిసార్లు నటులు తమకోసం కాకుండా ఇంకా విశాలంగా ఆలోచించి సినిమాలు చేయాలి. ఈ చిత్రంతో నేనా ప్రయత్నమే చేశాను.
కోర్టు రూమ్ డ్రామా అనుకోవచ్చా?
ఒక సమస్య పరిష్కారం కోసం కోర్టుకు నా పాత్ర వెళ్తుంది. నాతో పాటు ఒక న్యాయవాది పాత్ర ప్రయాణం చేస్తుంది. అయితే సినిమా మొత్తం కోర్ట్ రూమ్ డ్రామా కాదు. మిగతా పాత్రలు, అంశాలుంటాయి. కొన్ని యథార్థ ఘటనల నేపథ్యంతో అల్లుకున్న కథ ఇది. భర్త కోసం సావిత్రి పోరాటం చేయడం పురాణాల్లో విన్నాం. ఈ సినిమాలో తండ్రి కోసం కూతురు అలా పోరాటం చేస్తుంది. ఆ క్రమంలో ఎదురైన పరిస్థితులు ఏంటనేది సినిమా.
టీచర్ పాత్రలో ఎలాంటి భావోద్వేగాలకు గురయ్యారు?
మనం ఇష్టమున్నా లేకున్నా ఉద్యోగాలు చేస్తుంటాం. గార్గి కూడా అంతే. తను టీచర్. ఒక కెమెరా తీసుకుని క్లాస్ రూమ్‌లోకి వెళ్తే టీచర్, విద్యార్థులను చూస్తామో ఇందులోనూ అలాగే కనిపిస్తుంది. ఆమె స్ట్రిక్ట్ కాదు అలా అని విద్యార్థులతో సరదాగా ఉండదు. నేను చిన్నప్పుడు స్కూల్లో హాజరు తీసుకొని డ్యాన్స్ నేర్చుకునేందుకు వెళ్లేదాన్ని. ఈ టీచర్ పాత్రలో నటిస్తున్నప్పుడు వాళ్ల భావోద్వేగాలు ఎలా ఉంటాయో తెలిసింది.
ఈ సినిమాలో మీకంటే ముందు ఐశ్వర్య లక్ష్మిని అనుకున్నారు కదా..?
అవును. ఐశ్వర్య లక్ష్మి ఈ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించింది. ఈ చిత్రంలో చిన్న క్యారెక్టర్ చేసింది. ఆమె నటించాల్సిన సినిమానే ఇది. నా దగ్గరకు వచ్చింది. అలా నేను కూడా కొన్ని చిత్రాలకు మరో నాయికను పెట్టుకోండి. ఈ కథకు నాకంటే ఆమె సరిగ్గా సరిపోతుందని చెప్పిన సందర్భాలూ ఉన్నాయి.

అమ్మాయిలపై వివక్ష ఉంటుందనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారా?
సహజంగా ఒక అబ్బాయికి ఇచ్చిన స్వేచ్ఛ అమ్మాయికి ఇవ్వరు. మా ఇంట్లో నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంటారు. ఒక అబ్బాయి అయితే ఇలాగే త్వరగా పెళ్లి చేసేస్తారా అని ప్రశ్నిస్తుంటా. అలాంటివే ఈ సినిమాలోనూ ఉంటాయి. సందేశాత్మక సినిమా కాదిది. వినోదాన్ని అందిస్తూనే ఆలోచింపజేస్తుంది.
సూర్య, రానా నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరించడంపై మీ స్పందన..?
సినిమా పూర్తయ్యాక ఉదయనిధి స్టాలిన్‌తో పాటు సూర్య, జ్యోతికకు ఈ సినిమా చూపించాం. ఆయన ఈ సినిమాకు ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తానని ముందుకొచ్చారు. జ్యోతిక కూడా నా పేరు వేయండి అంది. అలాగే రానాకు ఫోన్ చేసి అడగ్గానే, నువ్వు నటించే సినిమా తప్పకుండా కొత్తగా ఉంటుంది, నేను రిలీజ్ చేస్తా అన్నారు. ఒక మంచి సినిమా కోసం వాళ్లిద్దరూ అలా ఆలోచిస్తారు. ఉదయనిధి స్టాలిన్ బాగా రిలీజ్ చేద్దామని మాటిచ్చారు.
కమర్షియల్ సినిమాలు చేయట్లేదని అనిపిస్తుంటుందా?
విరాటపర్వం, లవ్ స్టోరి, గార్గి, శ్యామ్ సింగరాయ్ ఇలా వరుసలో సినిమాలు ఒప్పుకుంటే కోవిడ్ వల్ల విడుదల ఆలస్యమై ‘లవ్ స్టోరి’, ‘శ్యామ్ సింగరాయ్’ ఒకసారి, ‘విరాటపర్వం’, ‘గార్గి’ వెంటవెంటనే రిలీజ్ అవుతున్నాయి. దాంతో మీకలా అనిపిస్తుండొచ్చు. కమర్షియల్ సినిమాల్లో క్యారెక్టర్ బాగా లేకుంటే ఇలాంటివి ఎందుకు చేస్తుందని మీరే అంటారు. సరదాగా సాగే సినిమాల్లో నటించాలని నాకూ ఉంది. కిల్ బిల్ తరహాలో యాక్షన్ చిత్రాల్లో నటించడమూ ఇష్టమే.
‘విరాటపర్వం’ ఫలితం బాధించిందా?
ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నేను బాగా నటించానని, మంచి చిత్రం చేశానని ప్రశంసించారు. అక్కడే మాకు విజయం లభించింది. నేను సినిమా విషయంలో కోరుకునేది నటిగా నాకు దక్కే సంతృప్తినే. కొన్నిసార్లు బాక్సాఫీస్ దగ్గర అనూహ్య ఫలితాలు వస్తుండటం సహజమే.
ఇటీవల మీ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి?
నేను మాట్లాడిన దాంట్లోని ఒక భాగాన్ని తీసుకుని వ్యాప్తి చేశారు. నాకు ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యం లేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Gargi Movie
- Sai Pallavi
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

