Sai Pallavi | ‘గార్గి’ విడుదల తేదీను ప్రకటించిన సాయిపల్లవి.. రిలీజ్ ఎప్పుడంటే?
Gargi Release Date Announced | నటన ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ దక్షిణాదిన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నటి సాయి పల్లవి. ప్రస్తుతం ఈమెకు స్టార్ హీరోకు ఉన్నంత క్రేజ్ ఉంది. గ్లామర్‌కు అతీతంగా మంచి పాత్రలు పోషిస్తూ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరైంది. ఇటీవలే ‘విరాటపర్వం’తో మరోసారి తన నటనతో ప్రేక్షకులను మాయ చేసింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా సాయిపల్లవి నటనకు మాత్రం గొప్ప ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఈమె నటించిన చిత్రం ‘గార్గి’. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించాడు. తాజాగా సాయి పల్లవి ఈ సినిమా విడుదల తేదీను ప్రకటించింది.
గార్గి చిత్రాన్ని జూలై 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సాయి పల్లవి బర్త్‌డే సందర్భంగా ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, మేకింగ్ వీడియోలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని తమిళంలో 2డీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై హీరో సూర్య, జ్యోతిక విడుదల చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ’96’ ఫేం గోవింద్ వసంత్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రవిచంద్రన్ రామచంద్రన్, ఐశ్వర్య లక్ష్మీ, థామస్ జార్జ్ సంయుక్తంగా నిర్మించారు.
#Gargi will be Yours from the 15th of July! @prgautham83 @kaaliactor @SakthiFilmFctry @2D_ENTPVTLTD pic.twitter.com/Gg9w5JCgPl
— Sai Pallavi (@Sai_Pallavi92) July 2, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

