హీరో సాయిదుర్గతేజ్ కథానాయకుడిగా ‘క’ఫేం దర్శక ధ్వయం సుజిత్, సందీప్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్నది. ‘SDT 19’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సాహు గారపాటి నిర్మాత. ‘యుగాలుగా బయటకు రాని రహస్యాలు, ఊహకు అందని శక్తుల చట్టూ తిరిగే ఓ కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాం’ అంటూ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని శుక్రవారం మేకర్స్ విడుదల చేశారు. ‘క’ వంటి విభిన్నమైన కథాంశాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన సుజిత్, సందీప్ ధ్వయం..
అంతకు మించిన హై ఆక్టేన్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. పౌరాణిక అంశాల మేళవింపుగా సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆడియన్స్‌కి గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని వారన్నారు. విస్తారమైన ఆకాశ గోళాల ముందు నిలబడి చూస్తున్న ఓ యోధుడ్ని ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్లో చూడొచ్చు. ఈ చిత్రానికి సమర్పణ: శ్రీమతి అర్చన, నిర్మాణం: షైన్ స్క్రీన్స్.