సాయిధన్సిక, అమిత్ తివారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అ ంతిమ తీర్పు’. ఏం. అభిరాం దర్శకుడు. శ్రీ సిద్ధి వినాయక మూవీస్ పతాకంపై డి. రాజేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఇటీవలే టైటిల్ను ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ ఇది. సాయిధన్సిక పాత్ర భిన్న కోణాల్లో సాగుతుంది. ఆమె న్యాయం కోసం చేసిన పోరాటమేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది’ అన్నారు.
కోటి చక్కటి సంగీతాన్నందించాడని, త్వరలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ సినిమాలో తన పాత్ర స్ఫూర్తివంతంగా ఉంటుందని కథానాయిక సాయి ధన్సిక పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ఎన్.సుధాకర్ రెడ్డి, సంగీతం: కోటి, దర్శకుడు: ఏ. అభిరాం.