Varalaxmi Sarathkumar | ‘తెలుగులో తొలిసారి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేశా. లీడ్‌రోల్ చేశాను కనుక కథ నాకు తెలుసు. కథలోని ఆసక్తికర సన్నివేశాలను, మలుపులను లైట్‌గా టచ్ చేస్తూ ట్రైలర్ రూపొందించారు. ట్రైలర్ నాకు నచ్చింది. నిర్మాతగా తొలి ప్రాజెక్ట్ ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ ఎంచుకొని, బడ్జెట్ ఎక్కువ అవుతున్నా ఏ మాత్రం రాజీపడకుండా, వేరే ఆలోచన చేయకుండా పాషన్‌తో సినిమాను నిర్మించిన మహేంద్రనాథ్ కూడ్లగారికి నా ధన్యవాదాలు. నిజంగా ఇది వండర్ఫుల్ స్క్రిప్ట్. తన బిడ్డను కాపాడుకోడానికి తల్లి ఏం చేసిందనేది ఈ సినిమా కథ. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను జనం ఆదరిస్తున్నారు.
నా గత చిత్రం ‘హను-మాన్’ మాదిరిగానే ఈ సినిమాను కూడా ఆడియన్స్ ఆదరిస్తారని, నిర్మాతకు ఈ సినిమా మంచి లాభాలు తీసుకురావాలని ఆశిస్తున్నాను’ అని వరలక్ష్మీ శరత్‌కుమార్ అన్నారు. ఆమె ప్రధానపాత్ర పోషించిన చిత్రం ‘శబరి’. అనిల్ కట్జ్ దర్శకుడు. మహేంద్రన్ కూండ్ల నిర్మాత. మే 3న సినిమా విడుదల కానుంది. ఈ సందర్బంగా సినిమా ట్రైలర్‌ని శుక్రవారం ఐదు భాషల్లో విడుదల చేశారు. హీరో వరుణ్‌సందేశ్ ముఖ్యఅతిధిగా హాజరై ట్రైలర్‌ను లాంచ్ చేసి, చిత్రయూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. నిర్మాత శ్రేయస్సు గురించి ఆలోచించే గొప్ప సంస్కారమున్న నటి వరలక్ష్మీశరత్‌కుమార్ అని, ఆమె నటనే ఈ సినిమాకు ప్రధాన బలమని నిర్మాత చెప్పారు. ఇంకా అమరదీప్, నటుడు ప్రభు కూడా మాట్లాడారు.