Tollywood | అక్టోబర్ 6న అరడజన్ సినిమాలు.. ఒక్కటైనా హిట్ అయ్యేనా..?
Tollywood | అతివృష్టి.. అనావృష్టి అంటే ఐడియా ఉంది కదా..? మన నిర్మాతలకు ఇది బాగా తెలుసు. అరే బాబూ ఈ వారం ఒక్క సినిమా కూడా లేదు రిలీజ్ చేయండ్రా నాయనా అంటే ఒక్కరు కూడా పట్టించుకోరు. కానీ ఒక్కో వారం మాత్రం పొలోమంటూ అరడజన్ సినిమాలు విడుదల చేస్తుంటారు.
Tollywood | అతివృష్టి.. అనావృష్టి అంటే ఐడియా ఉంది కదా..? మన నిర్మాతలకు ఇది బాగా తెలుసు. అరే బాబూ ఈ వారం ఒక్క సినిమా కూడా లేదు రిలీజ్ చేయండ్రా నాయనా అంటే ఒక్కరు కూడా పట్టించుకోరు. కానీ ఒక్కో వారం మాత్రం పొలోమంటూ అరడజన్ సినిమాలు విడుదల చేస్తుంటారు. అందులో ఊరు పేరు లేని సినిమాలే చాలా ఉంటాయి.. థియేటర్స్‌కు ఊపు తీసుకొచ్చే సినిమాలు తక్కువగా ఉంటాయి. అక్టోబర్ 6న ఇదే జరగబోతుంది. గతవారం స్కంద, పెదకాపు, చంద్రముఖి 2 సినిమాలు వచ్చినా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. స్కంద మాత్రం స్టార్ పవర్‌తో ఓపెనింగ్స్ అయితే తెచ్చుకుంటుంది కానీ దానికి ఉన్న టాక్ ప్రకారం చూస్తే లాంగ్ రన్ అయితే కష్టమే అవుతుంది. 5 రోజుల వీకెండ్ కాబట్టి 50 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం. కానీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రావాల్సింది 50 కోట్ల గ్రాస్ కాదు.. 100 కోట్లు. అది సాధ్యమవుతుందా లేదా అనేది చూడాలిక. ఇదిలా ఉంటే వచ్చే వారం మాత్రం చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయి.
అక్టోబర్ 6న రాబోయే సినిమాల్లో మ్యాడ్ ఒకటి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అది కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమా కావడం దానికి కలిసొచ్చే విషయం. పైగా జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. మరోవైపు అదే రోజు కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’ విడుదల కానుంది. ఈ రెండూ మినహాయిస్తే మిగతా సినిమాలకు పెద్దగా బజ్ అయితే లేదు. సుధీర్ బాబు ‘మామా మశ్చీంద్ర’ వస్తున్నా.. దీనిపై ముందు నుంచే పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. పైగా చాలా వాయిదాల తర్వాత ఈ సినిమా వస్తుంది. హర్షవర్ధన్‌కు దర్శకుడిగా పెద్దగా ట్రాక్ రికార్డ్ లేకపోవడంతో మామా మశ్చీంద్ర మామూలు సినిమాగానే కనిపిస్తుంది. విడుదల తర్వాత ఏదైనా మ్యాజిక్ చేస్తే చెప్పలేం.
ఇక కలర్స్ స్వాతి ‘మంత్ ఆఫ్ మధు’ ట్రైలర్ బాగుంది కానీ థియేటర్స్‌కు ప్రేక్షకులను రప్పించడానికి అది సరిపోతుందా అనేది తెలియాలి. తెలుగు సినిమాలనే ఆడియన్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు అంటే.. తమిళ డబ్బింగులు కూడా ఈ వారం బాగానే వస్తున్నాయి. అందులో ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ ఒకటి కాగా రెండోది సిద్ధార్థ్ హీరోగా నటించిన ‘చిన్నా’ సినిమా. ఈ రెండు సినిమాల్లో మురళీధరన్ బయోపిక్ కాస్తో కూస్తో బజ్ క్రియేట్ చేస్తుంది. ఇవి కాక నేనే సరోజ, రాక్షస కావ్యం అనే సినిమాలు కూడా వస్తున్నాయి. మరి వీటిలో ఒక్కటైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

