రామారావుగా మారిన రవితేజ.. లుక్ వైరల్!

మాస్ మహారాజా స్పీడ్ చూస్తుంటే కుర్ర హీరోలు సైతం షాకవతున్నారు. ఈ ఏడాది క్రాక్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ ఆ తర్వాత ఖిలాడీ అనే సినిమా చేశారు. ఈ సినిమా కరోనా వలన విడుదలకి నోచుకోలేదు. ఇక తాజాగా RT68 పేరుతో కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టాడు. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉంది. సెకండ్ వేవ్ తరువాత ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
తాజాగా చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. ‘రామారావు’ అనే టైటిల్ తో పైగా ‘ఆన్ డ్యూటీ’ అనే క్యాప్షన్ తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఈ పోస్టర్ లోనే క్లారిటీ ఇచ్చారు మేకర్స్.శరత్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్‌గా ఈ చిత్రంలో కనిపించబోతోన్నాడని తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగి రామారావుగా రవితేజ అదరగొట్టనున్నాడట. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తోన్న ఈ మూవీకి శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద ఈ చిత్రం రాబోతోంది. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ రవితేజకి జంటగా నటించబోతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

