e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home News క‌లిసి క‌ట్టుగా ప్ర‌జ‌ల‌ ముందుకు వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ టీం.. కార‌ణం ఏంటో తెలుసా?

క‌లిసి క‌ట్టుగా ప్ర‌జ‌ల‌ ముందుకు వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ టీం.. కార‌ణం ఏంటో తెలుసా?

క‌లిసి క‌ట్టుగా ప్ర‌జ‌ల‌ ముందుకు వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ టీం.. కార‌ణం ఏంటో తెలుసా?

క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌జ‌ల‌ను భయ‌పెట్టిస్తున్న సంగ‌గి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి వ‌ల‌న అంద‌రి జీవితాలు చెల్లాచెదురుగా మారాయి. క‌రోనా నుండి త్వ‌ర‌గా కోలుకోవాలంటే ప్ర‌తి ఒక్క‌రు విధిగా మాస్కులు, శానిటైజర్లు వాడాలని వైద్యులతో పాటు రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు.తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ప్ర‌జ‌ల‌లో మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించేందుకు క‌లిసిక‌ట్టుగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మాట్లాడిన వీడియోను యూట్యూబ్‌లో #StandTogether పేరుతో సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

ఆలియా భట్‌ తెలుగులో.. రామ్‌చరణ్‌ తమిళంలో.. ఎన్టీఆర్‌ కన్నడలో.. రాజమౌళి మలయాళంలో.. అజయ్‌దేవ్‌గణ్‌ హిందీలో మాట్లాడుతూ.. కరోనాపై జాగ్రత్తలు చెప్పారు. క‌రోనా జాగ్ర‌త్తలు ప్ర‌తి ఒక్క‌రు త‌ప్ప‌క పాటించాల‌ని ఎవ‌రు ఈ మ‌హ‌మ్మారిని అశ్ర‌ద్ధ చేయోద్దంటూ స్ప‌ష్టం చేశారు. మనకోసం, మన కుటుంబం కోసం, స్నేహితుల కోసం, చుట్టూ ఉన్నవారికోసం, దేశం కోసం జాగ్రత్తలు వహించాలని విజ్ఞప్తి చేశారు. పొరుగు రాష్ట్రాల ప్రజలకు తమ సందేశం చేరాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. కాగా, పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం అక్టోబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్టు తెలుస్తుంది.

- Advertisement -

Advertisement
-Advertisement-

తాజావార్తలు

ట్రెండింగ్‌

Advertisement