హైదరాబాద్, మార్చి24 (నమస్తే తెలంగాణ): ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రమోషన్లో భాగంగా ఆ సినిమా యూనిట్ ఆర్టీసీ బస్సుల్లో నేడు ప్రయాణించనుంది. అందుకోసం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ యూనిట్ మూడు ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకుంది. అనంతరం బస్సులను ఏర్పాటుచేసిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. మూవీ ప్రమోషన్‌కు ఆర్టీసీ ఇస్తున్న మద్దతుకు ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ ట్విట్టర్ వేదికగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.