RRR Pre Release Event | అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చి 50 రోజులు అయ్యుండేది. కానీ అనుకోని పరిస్థితుల్లో ఈ సినిమా వాయిదా పడింది. అయితే రాజమౌళి సినిమా ఎప్పుడొచ్చినా దానిపై క్రేజ్ మాత్రం తగ్గదు. జక్కన్న సినిమా వస్తుందంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో హీరోలతో పని లేకుండా కేవలం తన పేరుతోనే మార్కెట్ చేసుకునే దర్శకులలో రాజమౌళి అందరికంటే ముందుంటాడు. పోస్టర్‌పై రాజమౌళి అనే పేరు కనిపిస్తే చాలు వద్దన్నా వందల కోట్ల బిజినెస్ జరుగుతుంది. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమా బిజినెస్ కూడా అలాగే జరుగుతుంది. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి ఇద్దరు సూపర్ స్టార్స్ నటించినప్పటికీ రాజమౌళి సినిమా అంటూ ప్రచారం చేస్తున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దర్శక ధీరుడికి ఇండియన్ సినిమాలో ఉన్న ఇమేజ్ ఎంటనేది.
ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని 6 నెలలు దాటిపోయింది. మార్చి 25, 2022న సినిమా విడుదల కానుంది. ఈ మేరకు అధికారిక పోస్టర్ కూడా విడుదల చేశారు. సంక్రాంతికి ముందు భారీగా ప్రమోషన్ చేశారు. కానీ విడుదల వాయిదా పడడంతో అంతా వేస్ట్ అయిపోయింది. దాంతో ఇప్పుడు మరో భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ట్రిపుల్ ఆర్ రిలీజ్ ఈవెంట్ దుబాయిలో జరగబోతుందని తెలుస్తోంది. గతంలో శంకర్ తెరకెక్కించిన ఐ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అక్కడే జరిగింది. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమా బిజినెస్ విషయంలో ఇప్పుడు కొన్ని కొత్త లెక్కలు బయటికి వస్తున్నాయి.
కొన్ని ఏరియాల్లో ముందు మాట్లాడుకున్న దాని కంటే తక్కువ రేటుకు సినిమాను అమ్మేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 30 శాతం తక్కువకు ట్రిపుల్ ఆర్ సినిమా హక్కులు అమ్ముతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రాలోని ఈస్ట్ ఏరియా కరోనాకు ముందు 18 కోట్ల రేషియో డీల్ కుదుర్చుకున్నారని.. కానీ ఇప్పుడు అది 13 కోట్లకు తగ్గించినట్లు తెలుస్తోంది.
అలాగే ఉత్తరాంధ్ర హక్కులు కూడా 26 కోట్ల నుంచి 19 కోట్లకు.. ఆంధ్ర సీడెడ్ 98 కోట్ల నుంచి 68 కోట్లకు కుదించినట్లు ప్రచారం జరుగుతుంది. ఓవరాల్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 600 కోట్ల నుంచి 450 కోట్లకు తగ్గించారు అని ప్రచారం జరుగుతోంది. బయట ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని దర్శక నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలు నష్టపోకుండా డీల్ మాట్లాడుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.