ఏప్రిల్ 28నే ఆర్ఆర్ఆర్ రిలీజ్?

మార్చి 18 లేదా ఏప్రిల్ 28 ఇది ప్రతిష్టాత్మక తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ కు టీమ్ ఇచ్చిన రిలీజ్ డేట్స్. ఓమిక్రాన్ వ్యాప్తి ప్రభావంతో జనవరి 7న విడుదల కావాల్సిన ఈ పాన్ ఇండియా సినిమా విడుదల వాయిదా వేసుకుంది. కోవిడ్ వల్ల అత్యంత ప్రభావితమైన సినిమాల్లో ఆర్ఆర్ఆర్ ఒకటి. రామ్ చరణ్,
ఎన్టీఆర్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమా మేకింగ్ టైమ్ నుంచి ఇప్పుడు రిలీజ్ దాకా చాలా సార్లు ముందుగా అనుకున్న డేట్స్ అన్నీ మార్చేశారు. దసరా నుంచి సంక్రాంతి దాకా రిలీజ్ డేట్స్ వాయిదాలు పడ్డాయి. ఇక ఇప్పుడున్న పరిస్థితికి టీమ్ ఓ నిర్ణయానికి వచ్చి ప్రకటించిన డేట్స్ మార్చి 18 లేదా ఏప్రిల్ 28. అయితే ఈ డేట్స్ లోనూ ఒక డేట్ ఎగిరిపోయి, మరొకటి కన్ఫర్మ్ అయ్యే పరిస్థితులు స్పష్టమవుతున్నాయి.
పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆర్ఆర్ఆర్ ప్రతి స్టేట్ పరిస్థితిని అంగీకరించాల్సి ఉంది. కన్నడలో స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ సినిమా జేమ్స్ మార్చి నెలలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. కన్నడ పవర్ స్టార్ గౌరవార్థం ఆ నెలలో అంటే మార్చిలో మరో సినిమా రిలీజ్ చేయొద్దని అక్కడి పంపిణీదారులు నిర్ణయించారు. దీంతో ఆర్ఆర్ఆర్ ఆప్షన్ గా పెట్టుకున్న మార్చి 28 తేదీ కుదరదని తేలిపోయింది. మిగతా అన్ని భాషలతో పాటు కన్నడ మార్కెట్ ఆర్ఆర్ఆర్ కు కీలకం. కాబట్టి కర్నాటక రిలీజ్ ను ఆ టీమ్ విస్మరించదు. ఇక మిగిలిన డేట్ ఏప్రిల్ 28. ఈ తేదీకే ఆర్ఆర్ఆర్ విడుదలయ్యే అవకాశాలున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- April 28
- RRR
- RRR Release date
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

