RRR | ‘ఆర్ఆర్ఆర్’ కోసం నటీనటులు అంత పారితోషికాన్ని తీసుకున్నారా?
ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో 'ట్రిపుల్ ఆర్' ఒకటి. 'బాహుబలి' సినిమాతో రాజమౌళి తెలుగు సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్లోకి తీసుకెళ్లాడు.
RRR Actors Remunaration | ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘ట్రిపుల్ ఆర్’ ఒకటి. ‘బాహుబలి’ సినిమాతో రాజమౌళి తెలుగు సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్లోకి తీసుకెళ్లాడు. తన నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన అది జాతీయ స్థాయిలో వైరల్ అవుతుంది. దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ‘ట్రిపుల్ఆర్’ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు, ట్రైలర్ సినిమాపైన రెట్టింపు అంచనాలను నమోదు చేశాయి. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథను అందించాడు.
దానయ్య డివివి అత్యంత భారీగా దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇక ఈ చిత్రంలో నటినటుల పారితోషికాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రానికి ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు ఇద్దరు సమానంగా 45కోట్ల వరకు పారితోషికాలు తీసుకున్నారని సమాచారం. ఈ చిత్రం కోసం ఈ ఇద్దరు స్టార్లు మూడేళ్లు కేటాయించారు. అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ ఇప్పటి వరకు మరో సినిమా చేయలేదు. ఫోకస్ మొత్తం ట్రిపుల్ ఆర్ పైనే పెట్టాడు. ఆలియాభట్ ఈ చిత్రానికి 9కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్‌కు 25కోట్ల వరకు పారితోషికం అందిందని సమాచారం. జక్కన్న రాజమౌళికి మాత్రం ఈ చిత్ర లాభాల్లో 30% షేర్‌ను తీసుకుంటున్నట్లు సమాచారం. బాహుబలి సిరీస్‌కు రాజమౌళికి దాదాపు 90 కోట్ల వరకు పారితోషికం అందినట్లు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

