ప్రణవ్, షజ్ఞశ్రీ నాయకానాయికలుగా కొవ్వూరి అరుణ సమర్పణలో వస్తున్న సినిమా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’. గతంలో ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్, టీజర్, సాంగ్ విడుదలయ్యాయి. ఇప్పుడు రెండో పాటగా ‘చల్లగాలి’ అంటూ సాగే రొమాంటిక్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటివరకు లిరికల్ సాంగ్స్ రిలీజ్ కాగా, ఫస్ట్ టైం ఈ మూవీకి సంబంధించి వీడియో సాంగ్ విడుదలైంది. 2000’s బ్యాక్ డ్రాప్ నేటివిటికి తగ్గట్టుగా వస్తున్న ఈ సినిమా ముఖ్య తారాగణం: శ్రీ వేణుస్, రామ్ పటాస్, తేజగౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల. సంగీతం: కార్తీక్ రోడ్రిగ్జ్, కెమెరా: నిఖిల్ సురేంద్రన్, నిర్మాత: లోభువన్రెడ్డి కొవ్వూరి, రచన-దర్శకత్వం: శ్రీనాథ్ పులకురం.