డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ (Akash Puri) రీసెంట్గా రొమాంటిక్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే. ఇందులో కేతిక శర్మ (Ketika Sharma) హీరోయిన్గా నటించింది లవ్ డ్రామాగా తెరకెక్కిన ‘రొమాంటిక్’(Romantic) చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఊహించని కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది. చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం భారీగానే వస్తున్నాయి.
అక్టోబర్ 29న రొమాంటిక్ చిత్రం విడుదల కాగా, ఈ మూవీకి పోటీగా వరుడు కావలెను రిలీజ్ అయింది. వరుడు కావలెను చిత్రం ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కగా, రొమాంటిక్ యూత్ అండ్ మాస్ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అవుతోందని అంటున్నారు.రొమాంటిక్ సినిమాను మొత్తంగా 4.6 కోట్ల రేటుకి అమ్మగా.. ఈ సినిమా 5 కోట్ల రేంజ్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగింది. మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 3.39 కోట్ల షేర్ని అందుకుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది.
తొలి రోజు ఈ చిత్రం నిజాంలో 55 లక్షలు,సీడెడ్ లో 27 లక్షలు, యూఏలో 19లక్షలు, ఈస్ట్ 12 లక్షలు, వెస్ట్ 9 లక్షలు, గుంటూరు 14 లక్షలు, కృష్ణ 9.4లక్షలు, నెల్లూరు 7 లక్షలు సాధించాయి. ఏపీ-తెలంగాణలో 1.52 కోట్లు వసూళ్ళు సాధించగా, ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 1.61కోట్లు వసూళ్లు రాబట్టింది.ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి దర్శకత్వం వహించగా.. మాఫియా నేపథ్యంలో వస్తున్న ఓ ప్రేమ కథగా తెరకెక్కింది.