తరుణ్ ఫ్యామిలీని చుట్టు ముట్టిన పోలీసులు..!

ఆ కాలం నటీనటులు రోజా రమణి, చక్రపాణి దంపతుల కుమారుడు తరుణ్ మనసు మమత అనే చిత్రంతో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి, ఆ చిత్రానికి నంది అవార్డ్ కూడా దక్కించుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలలో నటించి మెప్పించిన తరుణ్ ఆ తర్వాత హీరోగా ఎదిగాడు. నువ్వే కావాలి సినిమాతో హీరోగా మారిన తరుణ్ .. ఆ తర్వాత ‘నువ్వు లేక నేను లేను’, ‘ప్రియమైన నీకు’, ‘నువ్వే నువ్వే’ వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి స్టార్ హీరోగా మారాడు.
తరుణ్ కెరీర్ గ్రాఫ్ ఎంత స్పీడ్‌గా పైకి వెళ్లిందో అంతే స్పీడ్‌గా పడిపోయింది. వరుసగా లవ్ స్టోరీతో సినిమాలు చేయడంతో లవర్ బాయ్ ఇమేజ్ను సైతం సొంతం చేసుకున్నాడు. ఒక రకంగా ఇదే అతడికి మైనస్ కూడా అయిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా టాక్ షోకు హీరో తరుణ్ తల్లిదండులైన రోజా రమణి, చక్రపాణి దంపతులు రాగా, వారు స్విట్జర్లాండ్‌లో జరిగిన ఓ చేదు ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చారు.
తరుణ్ ఎక్కువగా పూజలు చేస్తుంటారు . అందుకుని షూటింగ్‌కు ఎక్కడికి వెళ్లినా అగర్బత్తిలు, కర్పూరం తీసుకుని వెళ్తాం. అలా స్విడ్జర్లాండ్లోని హోటల్లో తరుణ్ అవి వెలిగించి పూజలు చేస్తుండగా.. పొగలు వచ్చి ఫైర్ అలారం మోగింది. దీంతో వెంటనే నలుగురు పోలీసులు మమ్మల్ని అందరినీ చుట్టుముట్టారు అంటూ ఆ నాటి చేదు అనుభవాలని వివరించారు తరుణ్ పేరెంట్స్. ఇటీవలే ‘అనుకోని అతిథి’లో హీరోకు డబ్బింగ్ చెప్పాడు తరుణ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | వైఎస్ జగన్ ఒక క్రిమినల్ లిటిగెంట్.. రాజకీయాల్లో ఇలాంటి వాళ్లు ప్రమాదకరం : చంద్రబాబు
AP News | ఏపీలోని 8 మున్సిపాలిటీల్లో నిలిచిన ఎన్నికల ప్రక్రియ..!
Saurav Das | సౌరవ్ దాస్, రాంకాలకు అదనపు జుడీషియల్ కస్టడీ కోరిన పోలీసులు.. ఆర్డర్ రిజర్వ్ చేసిన కోర్ట్
DGP CV Anand | అమరుల త్యాగాలతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు.. నిజాయితీగా సేవ చేయడమే వారికి నిజమైన నివాళి: డీజీపీ సీవీ ఆనంద్
‘తమపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

