అదిదా సర్ప్రైజ్
నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్'. వెంకీ కుడుముల దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. శ్రీలీల కథానాయిక. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. సోమవారం ‘అదిదా సర్ప్రైజ్..’ పేరుతో ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు.
నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’. వెంకీ కుడుముల దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. శ్రీలీల కథానాయిక. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. సోమవారం ‘అదిదా సర్ప్రైజ్..’ పేరుతో ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. ఇందులో కేతికశర్మ నర్తించింది. చంద్రబోస్ రాసిన ఈ గీతాన్ని అనురాగ్ కులకర్ణి ఆలపించారు. జీవీ ప్రకాష్ కుమార్ స్వరకర్త. హుషారెత్తించే మాస్ పాట ఇదని, ఈ ఏడాది హాటెస్ట్సాంగ్గా నిలుస్తుందని, శేఖర్ మాస్టర్ నృత్యరీతులు ప్రధానాకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం పేర్కొంది. హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్గా ‘రాబిన్‌హుడ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రచన-దర్శకత్వం: వెంకీ కుడుముల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

