Robin Hood| ఒకప్పుడు నటీనటులు ఏం మాట్లాడిన చెల్లేది. ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ఎవరి గురించి అయిన పబ్లిక్ మీటింగ్‌లో తప్పుగా మాట్లాడితే ఏకి పారేస్తున్నారు. అంతేకాదు బాయ్‌కాట్ అనే పదాన్ని ట్రెండింగ్‌లోకి తీసుకువస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటించిన లైలా చిత్రం ప్రీ రిలీజ్ వేడుక లో ప్రముఖ కమెడియన్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ మాట్లాడుతూ… ఈ సినిమాలో తాను మేకల సత్యం పాత్ర పోషించానని… షాట్ గ్యాప్ లో తన వద్ద ఉన్న మేకలు లెక్కబెడితే 150 వరకు ఉన్నాయని… తాను జైలు నుంచి బయటికివచ్చినప్పుడు లెక్కబెడితే 11 మేకలే ఉన్నాయని… అదేంటో తనకు అర్థం కాలేదంటూ జగన్‌ని ఉద్దేశించి అన్నారు.
ఈ వ్యాఖ్యల పట్ల వైసీపీ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ… బాయ్ కాట్ లైలా అంటూ హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి తీసుకు వచ్చారు. దీంతో తన చిత్రానికి నష్టం కలుగుతుందేమోనని భయంతో లైలా చిత్ర హీరో విష్వక్సేన్ రంగంలోకి దిగారు. పృథ్వీ చేసిన వ్యాఖ్యల పట్ల తాను క్షమాపణలు చెబుతున్నానని వెల్లడించారు. పృథ్వీ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని, వాటిని తమకు అపాదించవద్దంటూ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అయితే ఈ చిత్రం చివరికి బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. ఇక ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ కొంచెం డోస్ పెంచి ఏకంగా దొంగ ము** కొడుకు, రేయ్ అంటూ ఏకంగా ఇంటర్నేషనల్ క్రికెటర్ని అనడంతో లేనిపోని చిక్కుల్ని కొని తెచ్చుకున్నాడు.
ఆయన సరదాగా అని ఉండొచ్చేమో కాని ఆస్ట్రేలియా ప్లేయర్ గానే కాకుండా, సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తరపున కూడా ఆడి తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు డేవిడ్ వార్నర్. ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి వ్యక్తిని `దొంగ.. కొడుకు, మామూలోడు కాదు వీడు` అంటూ రెచ్చిపోయాడు. అంతటితో ఆగలేదు. `అరేయ్ వార్నర్ వార్నింగ్ ఇస్తున్నా` అంటూ మరో కామెంట్ చేశాడు. ఇదే ఇప్పుడు రచ్చ అవుతుంది. వార్నర్ ఫ్యాన్స్ రాజేంద్రప్రసాద్‌ని ట్రోల్ చేస్తున్నారు.
ఒకప్పుడు రాజేంద్రప్రసాద్‌పై చాలా గౌరవం ఉండేదని, ఈ స్పీచ్‌తో అంతా పోయిందని తిట్టిపోస్తున్నారు. అంతటితో ఆగకుండా రాబిన్ హుడ్ సినిమాని బాయ్‌కాట్ చేయాలని, సినిమాని చూడొద్దంటూ వార్నర్ ఫ్యాన్స్ కొత్త నినాదం అందుకున్నారు. వెంటనే రాజేంద్రప్రసాద్ సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా డేవిడ్ వార్నర్ పై రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ ప్రభావం ఇప్పుడు నితిన్ `రాబిన్ హుడ్`పై పడుతుంది. కాగా, మజాకా మూవీ కార్యక్రమంలో డైరెక్టర్ త్రినాధరావు చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘దిల్ రూబా’ మూవీ ప్రొడ్యూసర్ రవి కుమార్ అయితే సినిమాలో ఫైట్స్ హై ఇవ్వకపోతే రిలీజ్ రోజే తనని కొట్టండి అంటూ కాస్త ఓవర్‌గానే కామెంట్ చేయడం కూడా అప్పుడు చర్చనీయాంశం అయింది.