Seyon Shoot Begins | ‘అమరన్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నటుడు శివకార్తికేయన్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్లో మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI), టర్మరిక్ మీడియా బ్యానర్లపై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సెయోన్’ (SEYON). శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ సోమవారం మధురైలో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా సరికొత్త పవర్ఫుల్ పోస్టర్‌ను విడుదల చేస్తూ #Seyonshootstartstoday అనే హ్యాష్‌ట్యాగ్‌తో అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త పోస్టర్లో శివకార్తికేయన్ ఎంతో ఇంటెన్స్ అండ్ రగ్గడ్ లుక్‌లో, కోపంతో రగిలిపోతూ కనిపిస్తున్న విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
మాస్, రూరల్ యాక్షన్ డ్రామా, మరియు ఆధ్యాత్మిక అంశాల కలబోతగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన కింగ్డమ్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఆమె నటిస్తున్న మొదటి స్ట్రెయిట్ తమిళ్ సినిమా ఇది కావడం విశేషం. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, బాల శరవణన్, అరుళ్ దాస్, రైచల్ రెబెక్కా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.