RJ Balaji | కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టగా.. వీటిలో మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్టు కరుప్పు (Karuppu). పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఆర్జే బాలాజీ (RJ Balaji) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి . ఇప్పటికే లాంచ్ చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు ఊరమాస్ బీట్తో సాగుతున్న కరుప్పు ఫస్ట్ సింగిల్ God Mode నెట్టింట రౌండప్ చేస్తోంది. అయితే ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి న పలు కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ప్రమోషన్స్‌ను స్పీడప్ చేసిన సూర్య టీం పోస్టర్లలో మాత్రం విడుదల తేదీని పెట్టలేదు. దీనిపై డైరెక్టర్ ఆర్జే బాలాజీ క్లారిటీ ఇచ్చాడు.
తాము ఉద్దేశపూర్వకంగానే కరుప్పు ప్రమోషనల్ మెటీరియల్‌లో విడుదల తేదీని చూపించలేదన్నాడు. విడుదల తేదీతోపాటు పలు విషయాలు సెన్సార్ బోర్డు నుంచి చిక్కులు తెచ్చే అవకాశముందని చెప్పాడు. అయితే సినిమా ఎప్పుడు వస్తుందనేది సస్పెన్స్‌లో పెట్టకుండా 2026 మే 14న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పాడు. అభిమానులు, మూవీ లవర్స్ టపాసులు కాల్చేందుకు రెడీగా ఉండాలని సూచించాడు.
తాజా సీబీఎఫ్సీ గైడ్‌లైన్స్ ప్రకారం సెన్సార్ షిప్ పూర్తయ్యేంత వరకు సినిమా విడుదల తేదీని డిస్ప్లే చేయకూడదనే నిబంధన ఉండటంతో మేకర్స్ ఇటు ఆఫ్‌లైన్‌లో అటు ఆన్లైన్లో డేట్‌ను చూపించలేదు. ఈ మూవీలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. చాలా కాలం తర్వాత సూర్య, త్రిష కాంబోలో వస్తున్న సినిమా కావడంతో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ఆర్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి అభ్యాంకర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
కరుప్పు పోస్ట్ థ్రియాట్రికల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్టు కోలీవుడ్ సర్కిల్లో ఇప్పడకే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. . డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోగా.. శాటిలైట్ రైట్స్‌ను జీ తమిళ్ ఛానల్ రికార్డ్ ధరకు కొనుగోలు చేసిందని ఇన్సైడ్ టాక్.