Poonam Pandey | పూనమ్ పాండేకు మద్దతుగా నిలిచిన ఆర్జీవీ
Poonam Pandey | బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే (Poonam Pandey) మృతి చెందినట్లు శుక్రవారం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కొంతకాలంగా సర్వైకల్ క్యాన్సర్ (Cervical Cancer)తో బాధపడుతున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయినట్లు ఆమె మేనేజర్ మీడియాకు వెల్లడించారు. అయితే, ఆమె బతికే ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
Poonam Pandey | బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే (Poonam Pandey) మృతి చెందినట్లు శుక్రవారం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కొంతకాలంగా సర్వైకల్ క్యాన్సర్ (Cervical Cancer)తో బాధపడుతున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయినట్లు ఆమె మేనేజర్ మీడియాకు వెల్లడించారు. అయితే, ఆమె బతికే ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నటి టీమ్ అబద్ధం చెప్పిందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. నటి ఇన్స్టాగ్రామ్ నుంచి షాకింగ్ మెసేజ్ వచ్చింది. ‘నేను చనిపోలేదు.. ఇంకా బతికే ఉన్నాను’ అంటూ పూనమ్ ఓ వీడియో షేర్ చేసింది. తాను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో ఆ వీడియోలో వివరించింది. అయితే పూనమ్ చేసిన పనికి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. క్యాన్సర్ పై అవగాహనా కల్పించడానికి ఎవరైనా ఇలా చేస్తారా అంటూ పూనమ్‌పై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
అయితే ఈ వివాదంపై తాజాగా టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma) స్పందించాడు. సర్వైకల్ క్యాన్సర్‌పై దృష్టిని ఆకర్షించడానికి పూనమ్ పాండే ఎంచుకున్న పద్ధతి విమర్శలతో పాటు కొంతమందికి అర్ధం అవ్వక నచ్చకపోవొచ్చు. కానీ, ఏ ఒక్కరూ పూనమ్ ఉద్దేశ్యాన్ని ప్రశ్నించలేరు. ఇప్పుడు దేశమంతటా సర్వైకల్ క్యాన్సర్‌పై చర్చ జరుగుతోంది. ఇదంతా జరిగింది పూనమ్ వల్లే. మీరు ఎన్నో ఏళ్లు హ్యాపీగా జీవించాలని కోరుకుంటున్నా అంటూ పూనమ్‌పై రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు.
Hey @iPoonampandey the extreme method u employed to draw attention to this issue might attract some criticism , but no one can question ur INTENT nor what u ACHIEVED with this HOAX .. Discussion on cervical cancer is TRENDING all across now 🙏🙏🙏 Your SOUL is as BEAUTIFUL as YOU…
— Ram Gopal Varma (@RGVzoomin) February 3, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
Harish Rao | 12 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంది.. ఇప్పటికీ మన ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించలేదు : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

