RGV | సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) సినిమాల గురించి పత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన ఏం చేసినా వివాదమే. సినిమాల కోసం ఆయన ఎంచుకునే కథలు కూడా అలాగే ఉంటాయి. ఎవరు టచ్ చేయని పాయింట్స్ ను టచ్ చేస్తూ వైరల్ అవడం ఆయనకు అలవాటే. అయితే మరోసారి అలాంటి సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వర్మ రానున్నట్లు తెలుస్తుంది.
దివంగత టాలీవుడ్ నటుడు ఉదయ్ కిరణ్ బయోపిక్‌ను రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించునున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా వర్మ టీమ్ మొదలుపెట్టినట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తనకంటూ ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే తన నటనతో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు హీరో ఉదయ్ కిరణ్. అయితే ఆ తర్వాత వరుస ఫ్లాప్‌లు ఎదురవ్వడం.. ఆర్థిక ఇబ్బందుల వలన 2014 జనవరి 05న ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.