Republic Movie | వ్యవస్థపై తిరుగుబాటు

‘దేవుడితో పాటు అభిమానుల ఆశీస్సులతో సాయితేజ్ తొందరగా కోలుకున్నాడు. త్వరలో మనందరి మధ్యకు వస్తాడు’ అని అన్నారు అగ్రహీరో చిరంజీవి. ‘రిపబ్లిక్’ చిత్ర ట్రైలర్‌ను బుధవారం ఆయన విడుదలచేశారు. సాయితేజ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి దేవ కట్టా దర్శకుడు.జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మించారు. ట్రైలర్‌ను విడుదల చేసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ‘యువ కలెక్టర్‌గా రౌడీయిజాన్ని అరికట్టడానికి సాయితేజ్ ప్రయత్నించే సన్నివేశాలు ట్రైలర్లో ఆసక్తిని పంచుతున్నాయి. ఎలాంటి రాజకీయ వ్యవస్థను ఎన్నుకోవాలో ప్రజలకు తెలియజెప్పే సందేశాత్మక చిత్రమిది. ప్రజల్లో ఆలోచనను రేకెత్తించే ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని రావాలి’ అని తెలిపారు. ‘రాజకీయ నాయకులకు కొమ్ముకాచే రౌడీలకు, నిజాయితీపరుడైన యువ కలెక్టర్‌కు మధ్య సాగే పోరాటమే ఈ చిత్ర ఇతివృత్తం. తన పోరులో అతడు ఎలా విజయం సాధించాడన్నది ఉత్కంఠను పంచుతుంది. అక్టోబర్ 1న విడుదలచేయనున్నాం’ అని నిర్మాతలు చెప్పారు. ఐశ్వర్యరాజేష్, రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రల్ని పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

