GOOD TIME | కంటెంట్ ఉన్నా.. ప్రచారం లేక వెనుకబడిన ‘గుడ్ టైమ్’.. ఓటీటీ అనౌన్స్మెంట్ కోసం వెయిటింగ్!
Good Time | టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. భారీ బడ్జెట్లు, కమర్షియల్ హంగుల కంటే బలమైన కంటెంట్, సహజత్వానికి పెద్దపీట వేస్తున్న చిత్రాలకే ప్రేక్షకులు పట్టం కడుతున్నారు.
టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. భారీ బడ్జెట్లు, కమర్షియల్ హంగుల కంటే బలమైన కంటెంట్, సహజత్వానికి పెద్దపీట వేస్తున్న చిత్రాలకే ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఈ కోవకే చెందిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘గుడ్ టైమ్’ (Good Time). నేటి యువత ఎదుర్కొంటున్న వాస్తవిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, తగినంత ప్రమోషన్స్ లేకపోవడం వల్ల ఈ మంచి సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను చేరుకోలేకపోయింది. అయితే థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన సినీ ప్రియులు ప్రస్తుతం ఓటీటీ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం దీపావళి తర్వాత ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇక డిజిటల్లోకి వచ్చాక ఈ సినిమాకు మరింత ఆదరణ లభిస్తుందని చిత్ర యూనిట్ గట్టి నమ్మకంతో ఉంది.
కథ
సాధారణంగా సినిమాలలో హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్ అంటే పాతబస్తీ లేదా నగర కేంద్ర భాగాన్ని చూపించడం ఆనవాయితీ. కానీ, ఈ చిత్రంలో దర్శకుడు వినూత్నంగా హైదరాబాద్ శివారు ప్రాంతమైన అల్వాల్ నేపథ్యంలో ఎలాంటి సెట్లు వేయకుండా పూర్తిగా రియలిస్టిక్ లొకేషన్లలో సినిమాను తెరకెక్కించారు. తండ్రి అకస్మిక మరణంతో చదువు మధ్యలోనే ఆపేసిన జాని అలియాస్ జానకిరామ్ (నిఖిల్ గాజుల) కుటుంబ పోషణ కోసం క్యాబ్ డ్రైవర్‌గా మారుతాడు. అదే ప్రాంతానికి చెందిన నిశ్చల (అన్యుక్త నలాని)తో ప్రేమలో పడతాడు. అయితే, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఆన్లైన్ బెట్టింగ్‌లు, లోన్ యాప్స్ ఉచ్చులో పడి భారీగా అప్పులపాలవుతాడు. ఒకవైపు అప్పుల వాళ్ల ఒత్తిడి, మరోవైపు ప్రియురాలి నుంచి ఎదురైన ఊహించని పరిణామాలు జాని జీవితాన్ని తలకిందులు చేస్తాయి. వీటికి తోడు తల్లి (సునీత) చేసిన ఓ పొరపాటు కూడా అతడి మెడకు చుట్టుకుంటుంది. ఈ కష్టాల వలయం నుంచి జాని ఎలా బయటపడ్డాడు? చివరకు అతడి జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అనేదే ఈ చిత్ర అసలు కథ.
‘మై డియర్ దొంగ’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్.. హీరోగా తన తొలి చిత్రంలోనే ఎంతో పరిణితితో నటించాడు. తన నటన, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అన్యుక్త నలాని గ్లామర్‌తో పాటు తన అభినయంతో హీరోయిన్గా మెప్పించింది. ధన్‌రాజ్ వినీత్ కీలక పాత్రలో నటించి తమ అనుభవంతో సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul gandhi | టాటా గ్రూప్‌ను నాశనం చేస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై రాహుల్‌గాంధీ ఫైర్..!
Kriti Sanon | ఏఐ నన్ను భయపెడుతోంది.. సోషల్ మీడియాపై కృతి సనన్ ఆందోళన!
ACB Case | అరెస్ట్ చేయకుండా లంచం డిమాండ్.. బంజారాహిల్స్ ఎస్ఐపై ఏసీబీ కేసు
‘టేకులపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ బుకింగ్స్ ప్రారంభం.. ఈ శుక్రవారం నుంచే థియేటర్లలో సందడి!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

